ఇదిగో నాని కొత్త హీరోయిన్!

  • July 5, 2016 / 06:28 AM IST

“జెంటిల్ మెన్” సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్న నాని.. ప్రస్తుతం “ఉయ్యాల జంపాల” ఫేమ్ విరించివర్మ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు కాగా.. ఒకరు మలయాళ కుట్టి “యాక్షన్ హీరో బిజూ” ఫేమ్ అను ఎమ్మాన్యూల్. సెకండ్ హీరోయిన్ గా పంజాబీ భామ ప్రియా సింగ్ ను సెలక్ట్ చేశారట. చూడ్డానికి తెలుగమ్మాయిలా ఉన్న ఈ అమ్మడు ఈ సినిమాలో నాని మరదలిగా నటించనుందని వినికిడి.

ఇకపోతే.. నాని ఈ సినిమాలో అసిస్టెంట్ డైరెక్టర్ గా నటించనున్నాడు. రాజమౌళి కూడా ఈ సినిమాలో ఓ ముఖ్యపాత్ర పోషిస్తాడని సమాచారం!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus