మొన్నీమధ్య వచ్చిన ఓ సినిమా టీజర్లో ఓ డైలాగ్ ఉంటుంది… ఆ డైలాగ్‌కు ఆ మధ్య వచ్చిన మరో సినిమాలోని డైలాగ్‌ను కలిపి ఇప్పుడు పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ సోషల్ మీడియా సందడి చేస్తున్నారు. తొలి సినిమా విజయ్ దేవరకొండది కాదు, ఆ రెండో డైలాగ్ పవన్ కల్యాణ్‌దే. ఆ డైలాగ్స్ ఏంటి అనేది పక్కనపెట్టి… ఇప్పుడు కలిపి చెబుతున్న డైలాగ్ అయితే ‘వైరల్ అవ్వడానికి ఫేస్ కనిపించాలా ఏంటి? ఆ కటౌట్ చాలు’. మీరు పవన్ కల్యాణ్ ఫ్యాన్ అయినా, ట్విటర్‌ను ఎక్కువగా వాడినా ఈ విషయం ఏంటో మీకు ఇప్పటికే అర్థమైపోయుంటుంది.
పవన్ కల్యాణ్ లైనప్‌లో ఉన్న మూడు సినిమాల్లో ఫ్యాన్స్ ఎక్కువగా వెయిట్ చేస్తున్న సినిమాలు రాయమంటే తొలి స్థానంలో వచ్చే సినిమా ‘ఓజీ’. ఈ విషయంలో ఎలాంటి సెకండ్ థాట్ కూడా ఉండదు. ఆ సినిమా దర్శకుడు సుజీత్ ఇటీవల తన ఇన్స్టాగ్రామ్ డీపీని మార్చారు. అందులో ఏముంది… కొత్త ఫొటో ఏమైనా పెట్టి ఉంటాడు అనుకుంటున్నారా? అయితే ఆ డీపీ మీరు చూడలేదు అని చెప్పొచ్చు. ముఖాలు కనిపించని ఇద్దరు వ్యక్తులు ఆ డీపీలో ఉన్నారు.
ఎక్కడో ఇద్దరు వ్యక్తులు నడుచుకుంటూ వెళ్తుండగా… వెనుక నుండి ఫొటో తీశారు. ఆ ఇద్దరిలో ఒకరు ‘ఓజీ’ అయితే… మరొకరు ‘ఓజీ’ సృష్టికర్త. తన అభిమాని కమ్ దర్శకుడు అయిన సుజీత్ భుజం మీద చేయి వేసి నడుచుకుంటూ వెళ్తున్నట్లు ఆ ఫొటో చూస్తే అర్థమవుతోంది. ముఖాలే కనిపించని ఆ ఫొటో ఇప్పుడు వైరల్ అవ్వడానికి కారణం ‘తన ‘ఓజీ’తో సుజీత్’ (Sujeeth) అని కామెంట్స్ రావడమే.
ఇక పైన చెప్పిన డైలాగ్స్ లెక్కేంటి అంటే.. ‘ఫ్యామిలీ స్టార్’ సినిమాలో ‘ఐరనే వంచాలా ఏంటి?’ అనే డైలాగ్ ‘కంటెంట్ ఉన్నోడికి కటౌట్ చాలు’ అనే డైలాగ్‌లు కలిపి ‘వైరల్ అవ్వడానికి ఫేసే కనిపించాలా ఏంటి? కటౌట్ చాలు’ అని అంటున్నారు. ఇక ‘ఓజీ’ సంగతి చూస్తే… సెప్టెంబరు 27న సినిమా రిలీజ్ చేస్తామని టీమ్ ఇటీవల ప్రకటించింది.