యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర, వార్2 సినిమాలలో నటిస్తున్నారు. సైఫ్ అలీ ఖాన్ గాయం వల్ల దేవర రిలీజ్ కు సంబంధించి మార్పులు జరిగాయి. సైఫ్ అలీ ఖాన్ పూర్తిస్థాయిలో కోలుకుని త్వరలో ఈ సినిమా షూటింగ్ లో పాల్గొననున్నారు. అయితే వార్2 సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తున్న హృతిక్ రోషన్ కాలికి కూడా గాయమైందని సమాచారం అందుతుండటం గమనార్హం. ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా ఈ విషయాలు వెల్లడయ్యాయి.
తన సినిమాలలో నటిస్తున్న కీలక నటులకు గాయాలు కావడం వల్ల ఎన్టీఆర్ సినిమాలు వాయిదా పడుతున్నాయని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. హృతిక్ రోషన్ బెల్ట్ పట్టుకుని క్రచెస్ సహాయంతో నిలబడిన ఫోటోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడం జరిగింది. ఎన్టీఆర్ సినిమాలకే ఎందుకిలా అంటూ ఫ్యాన్స్ సైతం కామెంట్లు చేస్తున్నారు. హృతిక్ రోషన్ గాయం వల్ల వార్2 సినిమా ఆలస్యం అయ్యే ఛాన్స్ అయితే ఉందని తెలుస్తోంది.
మరోవైపు ఇకపై స్పై యూనివర్స్ లో తెరకెక్కే అన్ని సినిమాలలో జూనియర్ ఎన్టీఆర్ విలన్ గా కనిపిస్తారని తారక్ పాత్ర ప్రధానంగా ఒక సోలో ఫిల్మ్ ను కూడా ప్లాన్ చేస్తున్నారని సమాచారం అందుతోంది. అయితే ఎన్టీఆర్ స్పందిస్తే మాత్రమే ఈ వార్తల గురించి పూర్తిస్థాయిలో స్పష్టత వస్తుంది. దేవర మూవీ కథ గురించి సైతం ఎన్నో వార్తలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుండగా టీజర్ లేదా ట్రైలర్ రిలీజైతే ఆ వార్తల గురించి స్పష్టత వస్తుంది.
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) సినిమాలకు సంబంధించి ప్లానింగ్ లో కీలక మార్పులు చోటు చేసుకుంటూ ఉండటం నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది. దేవర ప్రమోషన్స్ ఎప్పటినుంచి మొదలవుతాయనే ప్రశ్నకు సంబంధించి కూడా త్వరలో సమాధానం దొరికే ఛాన్స్ అయితే ఉంది.
యాత్ర 2 సినిమా రివ్యూ & రేటింగ్!
ఈగల్ సినిమా రివ్యూ & రేటింగ్!
లాల్ సలామ్ సినిమా రివ్యూ & రేటింగ్!