కోలీవుడ్ హీరో అయినప్పటికీ విశాల్ మన తెలుగువాడే అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక అనీషా రెడ్డి అనే అమ్మాయితో విశాల్ కు నిశ్చితార్ధం జరిగింది. త్వరలోనే వీళ్ళ పెళ్లి ఉంటుంది అనుకున్నారంతా..! అక్టోబర్ లో పెళ్ళి చేయడానికి ఇరు కుటుంబసభ్యులు నిర్ణయించారు కూడా. అయితే సడెన్ గా వీరి పెళ్ళి క్యాన్సిల్ అయ్యిందంటూ అనేక కథనాలు కూడా పుట్టుకొచ్చాయి. అనీషా తన సోషల్ మీడియా ఎంగేజ్మెంట్ ఫోటోలను డిలీట్ చేయడం అలాగే విశాల్ కూడా పిన్ చేసిన ఎంగేజ్మెంట్ ఫొటోస్ ను తీసెయ్యడంతో ఈ కథనాలు పుట్టుకొచ్చాయి. కానీ వీళ్ళు మాత్రం ఈ విషయం పై స్పందించలేదు.
అయితే వీళ్ళిద్దరూ బ్రేకప్ అయ్యారని అందరూ ఫిక్స్ అయిపోయిన టైంలో ఇప్పుడు అనీషా ఓ షాక్ ఇచ్చింది. నిన్న విశాల్ పుట్టినరోజు సందర్భంగా.. విషెస్ చెబుతూ తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఓ ఫోటో పెట్టి విశాల్ కోసం మెసేజ్ రాసుకొచ్చింది.. ”హ్యాపీ బర్త్ డే స్టార్.. నిన్ను ఎప్పటికీ ఆరాదిస్తూనే ఉంటాను.. నీ దిశగా గొప్పదనం రాబోతుంది.. నాకు నమ్మకం ఉంది.. లవ్ ఆల్వేస్” అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ పోస్ట్ చూసిన వారు డైలమాలో పడిపోయారు. అనీషా, విశాల్ విడిపోతే అనీషా ఇంత ప్రేమగా ఎలా విషెస్ చెబుతుందని సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏమిటంటే… ఈ పోస్ట్ ఇప్పుడు ఆమె సోషల్ మీడియా అకౌంట్ లో కనిపించడం లేదు. ఇది అనీషా షేర్ చేసిందా…. లేక ఎవరైనా ఆమె అకౌంట్ ను హ్యాక్ చేసారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కానీ ఈ ఫోటో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.