ఈ ఏడాది పెద్దగా అంచనాలు లేకుండా విడుదలై క్రిటిక్స్ నుంచి ప్రశంసలు పొందడంతో పాటు ప్రేక్షకులను ఆకట్టుకున్న సినిమాగా సీతారామం నిలిచింది. సోషల్ మీడియా వేదికగా ఈ సినిమా గురించి జోరుగా చర్చ జరుగుతుండగా 99 శాతం మంది ఈ సినిమా గురించి పాజిటివ్ గా చెబుతుండటం గమనార్హం. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ సినిమాలోని పాత్రలకు తమ నటనతో ప్రాణం పోశారనే చెప్పాలి. దుల్కర్, మృణాల్ కాంబినేషన్ లో మరో సినిమా రానుందని జోరుగా ప్రచారం జరుగుతుండగా తాజాగా అశ్వనీదత్ చేసిన కామెంట్లతో వైరల్ అవుతున్న వార్తలు నిజమేనని క్లారిటీ వస్తోంది.
వైజయంతీ మూవీస్ బ్యానర్ లో మరో లవ్ స్టోరీ రాబోతుందని తాజాగా ఆయన కామెంట్ చేశారు. సీతారామం కాంబినేషన్ లో సినిమా రానుందని హను రాఘవపూడి డైరెక్షన్ లో దుల్కర్, మృణాల్ హీరోహీరోయిన్లుగా ఈ సినిమా తెరకెక్కనుందని ఆయన చెప్పుకొచ్చారు. వైరల్ అవుతున్న వార్త సీతారామం సినీ అభిమానుల సంతోషానికి కారణమవుతోంది. సీతారామం సినిమా క్లాసిక్ అని ఈ కాంబినేషన్ లో మరో సినిమా అంటే సీతారామం సినిమాను మించి ఎక్స్ పెక్ట్ చేస్తున్నామని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు..
దుల్కర్, మృణాల్ లకు రాబోయే రోజుల్లో మరో సక్సెస్ దక్కనుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. సీతారామం సినిమాతో చాలామంది హను రాఘవపూడికి అభిమానులుగా మారిపోయారు. తర్వాత సినిమాలతో కూడా హను రాఘవపూడి ఆ పేరును నిలబెట్టుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. హను రాఘవపూడికి సినిమాసినిమాకు క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది.
క్లాస్ సినిమాలను తెరకెక్కిస్తూ హను రాఘవపూడి ఆ సినిమాలతో సక్సెస్ లను సాధిస్తున్నారు. సీతారామం సక్సెస్ తో హను రాఘవపూడి రెమ్యునరేషన్ ఊహించని స్థాయిలో పెరిగిందని తెలుస్తోంది. సీతారామం సినిమా నిర్మాతలకు 15 కోట్ల రూపాయల నుంచి 20 కోట్ల రూపాయల రేంజ్ లో లాభాలు మిగిలాయని సమాచారం.