పలు సినిమాల్లో నటించినప్పటికీ.. నటిగా రాణించలేకపోయింది నిహారిక.దాంతో పెళ్ళి చేసుకుని సెటిల్ అయిపోయింది. గుంటూరు ఐజీ కొడుకు మరియు సాఫ్ట్ వేర్ ప్రొఫెషనల్ అయిన చైతన్య జొన్నలగడ్డ ని ప్రస్తుతం ప్రస్తుతం అత్తారింట్లో ఉంటుంది నిహారిక. అంతేకాకుండా నిర్మాతగా తనకి కలిసొచ్చిన వెబ్ సిరీస్ లను నిర్మించేందుకు కూడా సన్నాహాలు చేస్తుంది. ఇటీవల నిహారిక తండ్రి మెగా బ్రదర్ నాగబాబు పుట్టినరోజు సందర్భంగా ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరి’ అనే వెబ్ సిరీస్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.
జీ5 సంస్థతో కలిసి నిహారిక ఈ వెబ్ సిరీస్ ను నిర్మిస్తోంది. సంతోశ్ శోభన్, సిమ్రాన్ శర్మ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ వెబ్ సిరీస్ నవంబర్ 19 నుండీ ప్రారంభం కానుంది. ఇక సోషల్ మీడియాలో కూడా నిహారికకి ఫాలోయింగ్ ఎక్కువే అన్న సంగతి తెలిసిందే.తన లేటెస్ట్ ఫోటోలని అలాగే తన భర్తతో కలిసున్న ఫోటోలని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటుంది. తాజాగా తన పెట్ డాగ్ మొదటి పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా నిర్వహించింది నిహారిక.
దీనికి సంబంధించిన ఓ వీడియోని కూడా విడుదల చేసింది. తన భర్త చైతన్యతో కలిసి తన పెట్ తో కేక్ కట్టింగ్ కూడా చేయించింది. ‘బజ్ బాయ్ మొదటి పుట్టినరోజు జరుపుకున్నాడు’ అంటూ ఓ కామెంట్ కూడా పెట్టింది నిహారిక. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.