కొణిదెల కుటుంబం నుంచి వచ్చిన ఏకైక కథానాయికగా ఇండస్ట్రీలో నీహారికకు మంచి పాపులారిటీ ఉంది. కొన్ని షార్ట్ ఫిలిమ్స్ మరియు వెబ్ సిరీస్ లు చేసిన నీహారిక యూట్యూబ్ లో సక్సెస్ అయినట్లుగా “ఒక మనసు” చిత్రంతో కథానాయికగా మాత్రం సక్సెస్ సాధించలేకపోయింది. ఆమె నటించిన “ఒక మనసు” విమర్శకులతోపాటు ప్రేక్షకులను కూడా అలరించలేకపోయింది. దాంతో.. నెక్స్ట్ ఎలాంటి స్టెప్ తీసుకోవాలో తెలియక కన్ఫ్యూజన్ లో పడిపోయిందట పాపం కొణిదెల పాప.
తనకు కలిసొచ్చిన టీవి షోలు, షార్ట్ ఫిలిమ్స్ కంటిన్యూ చేస్తూ ఎలాంటి గోలా లేకుండా హ్యాపీగా సెటిల్ అయిపోదామా? లేక ఇంకోసారి హీరోయిన్ గా లక్ చెక్ చేసుకొందామా? అని తెగ ఆలోచించేస్తుందట నీహారిక. మెగా అభిమానులు మాత్రం నీహారికను సినిమాల కంటే షార్ట్ ఫిలిమ్స్ కు పరిమితం చేయడమే సబబు అని భావిస్తున్నారట.