మెగా ఫ్యామిలీలో ఇప్పటికే అరడజను మంది పైనే హీరోలున్నారు. సంవత్సరానికి ఎంతకాదనుకున్నా 6 నుండీ 7 సినిమాల వరకూ ఈ హీరోల నుండీ వస్తుంటాయి. దాదాపు ఈ హీరోలు అందరూ హిట్లందుకున్నారు. కానీ ఇదే ఫ్యామిలీ నుండీ ఇండస్ట్రీకి వచ్చిన నిహారిక మాత్రం ఒక్క హిట్టు కూడా అందుకోలేదు. మొదట్లో వెబ్ సిరీస్ లతోనూ, టీవీ షోలతోను ప్రేక్షకులని అలరిస్తూ మంచి క్రేజ్ సంపాదించుకున్న నిహారిక సినిమాల్లో మాత్రం రాణించలేకపోతుంది. ‘ఒక మనసు’ చిత్రంతో అరంగేట్రం చేసిన నిహారిక.. ఆ చిత్రంతో పర్వాలదనిపించుకున్నప్పటికీ.. కమర్షియల్ సక్సెస్ ను మాత్రం సొంతం చేసుకోలేకపోయింది. ఇక అటుతరువాత వచ్చిన ‘హ్యాపీ వెడ్డింగ్’ ‘సూర్యకాంతం’ చిత్రాలు.. మొదటి సినిమాని మించి డిజాస్టర్లు అయ్యాయి.
ప్రస్తుతం ‘సైరా’ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషిస్తున్న నిహారిక త్వరలోనే కొన్ని వెబ్ సిరీస్ లను నిర్మించే పనుల్లో బిజీగా ఉందట. ఇదిలా ఉండగా తన తండ్రి నాగబాబు లానే ఓ ఇండిపెండెంట్ సంస్థను స్థాపించి.. సినిమాలు నిర్మించాలని ప్రయత్నాలు మొదలుపెట్టిందట. ఇందుకు తన అన్న వరుణ్ తేజ్ సలహాలు కూడా తీసుకుంటుందట. మొదటి ప్రయత్నంగా.. మెగా ఫ్యామిలిలో కుర్ర హీరోలు అయిన సాయి తేజ్, వైష్ణవ్ తేజ్ వంటి వారితో సినిమాలు మొదలుపెట్టాలని భావిస్తున్నట్టు సమాచారం. మరి నిర్మాతగా అయినా నిహారిక రాణిస్తుందేమో చూడాలి..!