Niharika: నిహారిక వేయించుకున్న టాటూ కి ఇంత అర్థం ఉందా?

  • November 16, 2023 / 04:28 PM IST

నిహారిక కొణిదెల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మెగా డాటర్ గా ఇండస్ట్రీకి పరిచయం అయిన ఈమె కెరియర్ మొదట్లో యాంకర్ గా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. అలాగే హీరోయిన్ గా కూడా పని చేశారు. ఇలా హీరోయిన్ గా సక్సెస్ కాలేకపోయినటువంటి ఈమె అనంతరం పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలో స్థిరపడ్డారు. ఇక పెళ్లి జీవితంలో కూడా నిహారిక ఎక్కువ కాలం పాటు కొనసాగ లేకపోయింది. ఇలా తన భర్తతో వచ్చిన మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకొని విడిపోయి ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో నిర్మాతగా కొనసాగుతున్నారు.

ఇప్పటివరకు పలు వెబ్ సిరీస్ లలో నటించిన నిహారిక వెబ్ సిరీస్ లకు నిర్మాతగా కూడా వ్యవహరించారు. తాజాగా మరో సినిమాని కూడా నిర్మించబోతున్నట్లు. వెల్లడించారు ఇప్పటికే ఈ సినిమా పూజా కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది. ఈ పూజా కార్యక్రమాలలో భాగంగా నిహారిక వీపు మీద ఉన్నటువంటి ఒక టాటూ బయటపడింది. ఇలా ఈ టాటూకి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అసలు నిహారిక వేయించుకున్న ఈ టాటూ ఏంటి ఈ టాటూ వెనుక ఉన్న అర్థం ఏంటి అని పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అవుతున్నాయి

అయితే నిహారిక (Niharika) వీపుపై ఉన్నటువంటి ఈ టాటూ కనక చూస్తే ఒక పక్షి లాగా అనిపిస్తుంది. ఇలా రెక్కల విప్పిన పక్షిలా ఉండడంతో పలువురు ఈ టాటూ కి వివిధ రకాలుగా అర్థాలు బయటకు తీస్తున్నారు. చిన్నప్పటినుంచి ఎంతో స్వేచ్ఛగా బ్రతికినటువంటి నిహారిక అత్తారింటికి వెళ్లడంతో పంజరంలో బంధించిన పక్షిల మారిపోయారని అత్తారింట్లో ఈమెకు పెట్టిన కండిషన్స్ భరించలేక తాను తన భర్తకు విడాకులు ఇచ్చి విడిపోయారని మనకు తెలిసిందే.

ఇలా భర్త నుంచి విడాకులు తీసుకున్న తర్వాత తిరిగి ఆమె రెక్కలు విప్పిన పక్షిలా చాలా స్వేచ్ఛగా విహరిస్తున్నారనే అర్థం వచ్చేలాగే టాటూ వేయించుకున్నారని తెలుస్తుంది. ఇలా నిహారిక వేయించుకున్న టాటూ వెనుక ఉన్న అర్థం తెలిసి ఈ టాటూ కేవలం తన మాజీ భర్త కోసమే వేయించుకుందా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

జపాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus