కళ్యాణ్ బాబాయ్ లా ఫోజివ్వాలనుకుందో లేక సీన్ అలా సింక్ అయ్యిందో తెలియదు కానీ.. నీహారిక తమిళంలో నటిస్తున్న తాజా చిత్రంలో గన్ను పట్టికొని ఇచ్చిన ఫోజ్ ఒకటి అచ్చు గుద్దినట్లు పవన్ కళ్యాణ్ “గబ్బర్ సింగ్” సినిమాలో స్టిల్ ను పోలినట్లుగా ఫోజిచ్చింది. ప్రస్తుతం ఆ ఫోటో ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తోంది. నల్ల దుస్తుల్లో బంగారం ధరించి చేతిలో గన్ పట్టుకొన్న నీహారిక చూడ్డానికి లేడీ గబ్బర్ సింగ్ లా ఉంది. పక్కనే తమిళ స్టార్ నటుడు విజయ్ సేతుపతి ఇంకాస్త డిఫరెంట్ గా కనిపిస్తుండగా.. ఆ చిత్రం ఫిబ్రవరిలో విడుదలవ్వానుంది. “ఒరు నల్ల నాల్ పాతు” అనే టైటిల్ తో తెరకెక్కిన ఈ చిత్రంలో నీహారిక ఓ ముఖ్యపాత్రలో కనిపించనుందట. కథను మలుపు తిప్పే పాత్రని అని టాక్.
తెలుగులో నటించిన “ఒక మనసు” పెద్దగా అలరించలేకపోవడం, ఇక్కడన్నీ గ్లామర్ రోల్స్ వస్తుండడంతో.. మెగా ఫ్యామిలీ నుంచి ఏకైక హీరోయిన్ అయిన నీహారిక గ్లామర్ రోల్స్ చేయలేక, సినిమాలు వదిలేయలేక తమిళనాడుకేగింది. అక్కడ మెగా సపోర్ట్ తో ఆఫర్లు బాగానే దక్కించుకొంటున్నప్పటికీ.. హీరోయిన్ గా ఎక్స్ పోజింగ్ చేయకుండా ఎంతవరకూ నిలదొక్కుకుంటుంది అనేది మాత్రం ఆమెకే తెలియాలి. ఇకపోతే.. నీహారిక ప్రస్తుతం తెలుగులో ఓ రెండు సినిమాలు చేస్తోంది. ఒకదాంట్లో హీరో సుమంత్ అశ్విన్ కాగా.. ఇంకో సినిమా డీటెయిల్స్ ప్రస్తుతానికి సస్పెన్స్.