డ్యూడ్ నువ్వు అంత ఇంపార్టెంట్ వ్యక్తివి కావు : నిఖిల్ సిద్ధార్థ్

  • October 10, 2018 / 07:32 AM IST

స్టార్ హీరోలందరూ ఇమేజ్ లు, ఫ్యామిలీ స్టేటస్ లు పక్కన పెట్టేసి హ్యాపీగా కలిసిమెలిసి మెలుగుతుండగా.. కుర్ర హీరోల నడుమ ఆ సఖ్యత లోపించినట్లుగా తెలుస్తోంది. ఇటీవల విజయ్ దేవరకొండ సరికొత్త సినిమా “నోటా” ఫ్లాప్ అవ్వగానే.. కొందరు యువ హీరోలు ఏకంగా పార్టీ చేసుకొన్నారట. ఈ విషయం మొత్తానికి విజయ్ దేవరకొండ దాకా వెళ్లింది. యాటిట్యూడ్ కి బాప్ లాంటి విజయ్ ఈ విషయం తెలిసాక సైలెంట్ గా ఉంటాడా.. వెంటనే ఒక పెద్ద లెటర్ రాసి ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. “సెలబ్రేట్ చేసుకుంటున్నవాళ్ళంతా ఇప్పుడే పండగ చేసుకోండి.. ఐ విల్ బీ బ్యాక్” అంటూ పెట్టిన పోస్ట్ వైరల్ అయ్యింది.

ఈ పోస్ట్ కి కౌంటర్ గా పెట్టాడో ఏమో నిఖిల్ వెంటనే “డ్యూడ్ నువ్వు అంత ఇంపార్టెంట్ వ్యక్తివి కావు” అంటూ ఒక ట్విట్టర్ పోస్ట్ పెట్టాడు. దాంతో.. నిఖిల్ డైరెక్ట్ గా విజయ్ దేవరకొండను టార్గెట్ చేశాడు అనుకొన్నారందరూ. కానీ.. వెంటనే స్పందించిన నిఖిల్ ఆ పోస్ట్ అందరూ అనుకొంటున్నట్లుగా ఆ వ్యక్తిని ఉద్దేశించి కాదు.. అని క్లారిఫై చేస్తూ ఇంకో పోస్ట్ పెట్టాడు. ఈ ట్విట్టరాట ద్వారా ఏ హీరో ఎవరికి ఏం చెప్పాలనుకున్నాడో ఇంకా క్లారిటీ లేదు కానీ.. ఈ యువ హీరోల నడుమ సఖ్యత లేదని మాత్రం స్పష్టమైంది. కానీ.. పోటీ అనేది ఆరోగ్యకరంగా ఉండాలీ కానీ ఇలా సోషల్ మీడియాలో తిట్టుకొనేలా మాత్రం ఉండకూడదు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus