‘అర్జున్ సురవరం’ 5డేస్ కలెక్షన్స్..!

  • December 5, 2019 / 06:07 PM IST

అనేకసార్లు రిలీజ్ వాయిదా పడుతూ వచ్చినప్పటికీ ‘అర్జున్ సురవరం’ చిత్రం హిట్ లిస్ట్ లో చేరిపోయింది. నవంబర్ 29న విడుదలయిన ఈ చిత్రం మొదటి షో తోనే డీసెంట్ టాక్ ను సొంతం చేసుకుని మంచి కలెక్షన్లు రాబడుతోంది. నిఖిల్, లావణ్య త్రిపాఠి జంటగా నటించిన ఈ చిత్రాన్ని టి.సంతోష్ డైరెక్ట్ చేసాడు. రాజ్ కుమార్ ఆకెళ్ళ నిర్మించిన ఈ చిత్రానికి ‘ఠాగూర్’ మధు సమర్పకుడు. పేక్ సర్టిఫికేట్ ల వల్ల.. ఎంతో ట్యాలెంట్ ఉన్న కొందరి యువత భవిష్యత్తు నాశనమైతోందని.. ఆ ‘ఫేక్ సర్టిఫికేట్ మాఫియాని అంతం చేయడానికి ఓ జర్నలిస్ట్ ఎలాంటి స్టెప్ తీసుకున్నాడు అనే కధాంశంతో ఈ చిత్రం రూపొందింది. ఇక 5 రోజులు పూర్తయ్యేసరికి ‘అర్జున్ సురవరం’ కలెక్షన్లు ఈ విధంగా ఉన్నాయి :

నైజాం 1.18 cr
సీడెడ్ 0.56 cr
ఉత్తరాంధ్ర 0.67 cr
ఈస్ట్ 0.43 cr
వెస్ట్ 0.34 cr
కృష్ణా 0.45 cr
గుంటూరు 0.59 cr
నెల్లూరు 0.29 cr
ఏపీ + తెలంగాణ 4.51 cr(share)
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.25 cr
ఓవర్సీస్ 0.53 cr
టోటల్ వరల్డ్ వైడ్ 5.29 cr (share)

ఇక ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. ‘అర్జున్ సురవరం’ చిత్రానికి 5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగిందట. మిగిలిన ప్లేసుల్లో ఓన్ రిలీజ్ చేసుకున్నారట నిర్మాతలు. సో ఈ చిత్రం 5 కోట్ల షేర్ ను రాబడితే బ్రేక్ ఈవెన్ సాధించేసినట్టే. ఇక ఆ ఫీట్ ను కేవలం 5 రోజుల్లోనే సాధించాడు ‘అర్జున్ సురవరం’. పోటీగా మరే సినిమా లేకపోవడంతో ‘అర్జున్ సురవరం’ కు బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. వీక్ డేస్ లో కూడా ఈ చిత్రం మంచి కలెక్షన్లను రాబడుతుంది. ఇదే ఫ్లో కంటిన్యూ చేస్తే బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయమనే చెప్పొచ్చు.

అర్జున్ సురవరం సినిమా రివ్యూ & రేటింగ్!
రాజా వారు రాణి గారు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus