అదృష్టం బాలేక మధ్యలో “శంకరాభరణం” అనే డిజాస్టర్ పడింది కానీ.. ఆ ఒక్క సినిమా కౌంట్ లో నుండి తీసేస్తే “స్వామిరారా, కార్తికేయ, సూర్య వెర్సస్ సూర్య, ఎక్కడికి పోతావు చిన్నవాడా” లాంటి వరుస విజయాలతో దూసుకుపోతున్న నిఖిల్ సక్సెస్ స్ట్రీక్ మరోలా ఉండేది. ప్రస్తుతం నాలుగైదు ప్రొజెక్టులు హోల్డ్ లో పెట్టుకొని కూర్చున్న నిఖిల్ తాజా చిత్రం “కిర్రాక్ పార్టీ” రిలీజ్ ఎప్పుడనే విషయంలో భారీ కన్ఫ్యూజన్ నెలకొని ఉంది. తొలుత ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 9న రిలీజ్ చేద్దామనుకొన్నారు కానీ షూటింగ్ ఇంకా పూర్తికాకపోవడం వలన పోస్ట్ పోన్ చేయాల్సి వచ్చింది.
అయితే.. తాజా సమాచారం ప్రకారం “కిర్రాక్ పార్టీ” ఫిబ్రవరిలోనే కాదు మార్చిలో కూడా రిలీజయ్యే అవకాశాలు లేకపోవచ్చని తెలుస్తోంది. ఫిబ్రవరిలో సినిమా రిలీజయ్యే అవకాశాలు లేకపోవడం, మార్చిలో ఇండస్ట్రీ బంద్ ఉండడంతో.. ఏప్రిల్ లేదా మేలో సినిమాని రిలీజ్ చేసేందుకు సన్నద్ధమవుతున్నారు దర్శకనిర్మాతలు. కాలేజ్ లవ్ స్టోరీ కావడంతో సమ్మర్ హాలీడేస్ లోనే సినిమా రిలీజ్ అవ్వడం మంచిదని భావించిన నిఖిల్ కూడా సినిమా పోస్ట్ పోన్ ను లైట్ తీసుకొని తన తదుపరి చిత్రం కోసం సన్నద్ధమవుతున్నాడు.