అనుష్క, మాధవన్, అంజలి, షాలినిపాండే ప్రధాన పాత్రల్లో హేమంత్ మధుకర్ దర్శకత్వంలో కోనా వెంకట్ నిర్మించిన “నిశ్శబ్ధం” చిత్రం ఈనెల 31న విడుదలకావాల్సి ఉండగా.. కనీస స్థాయి ప్రమోషన్స్ కానీ, ట్రైలర్ కానీ విడుదల చేయకపోవడంతో సినిమా అనుకున్న తేదీకి విడుదలవ్వడం లేదని క్లారిటీ జనాలకి వారం క్రితమే వచ్చినా.. సినిమా ఫిబ్రవరి 20కి వాయిదాపడినట్లు నిన్న అనఫీషియల్ గా తెలిసింది. అయితే.. ఈ వాయిదా వెనుక కారణం మాత్రం అనుష్క పంతం అని తెలుస్తోంది.
అసలు విషయం ఏమిటంటే.. ఇటీవల “నిశ్శబ్ధం” ఫైనల్ అవుట్ పుట్ చూసిన అనుష్క కొన్ని మార్పులు సూచించిందట. మేకర్స్ ఆ మార్పులు చేయడానికి బడ్జెట్ పెరుగుతుందని భావించి నిరాకరించారట. దాంతో స్వీటీ సింపుల్ గా ప్రమోషన్స్ కి నేను రాను అని చెప్పేసిందట. అనుష్క ప్రమోషన్స్ కు రాకుండా “నిశ్శబ్ధం” చిత్రాన్ని విడుదల చేయడం అనేది ఎంత స్టుపిడ్ డెసిషనో అర్ధం చేసుకున్న కోన.. అనుష్క కోరిన మార్పులు చేసి ఫిబ్రవరికి సినిమాను రిలీజ్ కి రెడీ చేశాడు. మరి ఇన్ని మార్పులు జరిగిన “నిశ్శబ్ధం” సినిమా ఎలా ఉంటుందో చూడాలంటే ఫిబ్రవరి 20 వరకూ వెయిట్ చేయాల్సిందే.