నితిన్ నయా చిత్రం

‘అందాల రాక్షసి’ సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు హను రాఘవపూడి. అక్కడికి నాలుగేళ్ల తర్వాత గానీ అతడి రెండో సినిమా తెరమీదికి రాలేదు. అయితే మూడో సినిమాకి మాత్రం అంత గ్యాప్ ఇవ్వకుండా కెమెరా స్విచ్ ఆన్ చేసేశాడు. హను దర్శకుడిగా ఈ ఏడాది ఆరంభంలో విడుదలైన ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ సినిమా నిర్మించిన 14 రీల్స్ సంస్థే ఈ సినిమాని నిర్మించనుంది. నితిన్ హీరోగా నటించనున్న ఈ సినిమా గురువారం నాడు పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభం అయింది.

14 రీల్స్ బ్యానర్ లో నితిన్ కి ఇది తొలి చిత్రం అయినా దర్శకుడికి రెండోది. చూస్తుంటే ఏదైనా ఒప్పందం కుదుర్చుకున్నారా అన్న అనుమానం తలెత్తుతోంది. ఆ మాటెలా ఉన్నా అఖిల్ హీరోగా హను మూడో సినిమా ఉంటుందని వినపడింది. అయితే మధ్యలో విక్రమ్ కుమార్ ఎంట్రీ ఇచ్చాడు. దాంతో నితిన్ తో నయా చిత్రం షురూ చేశాడు హను. కథల ఎంపికలో తడబడి ఎదురు దెబ్బలు తిన్న నితిన్ త్రివిక్రమ్ పుణ్యమా అని 50 కోట్ల క్లబ్ లో మెంబర్ అయిపోయాడు. ఇప్పుడు తర్వాతి సినిమా కోసం హను లాంటి దర్శకుడితో చేయి కలపడం శుభ సూచికమే. వేసవిలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus