గత ఏడాది భీష్మ సినిమాతో బాక్సాఫీస్ హిట్ అందుకున్న నితిన్ ఈ సారి ఎంతో ప్రయోగాత్మకమైన చెక్ సినిమాతో అంతకంటే హై రేంజ్ లో హిట్ కొట్టాలని చూస్తున్నాడు. ఈ సినిమా కమర్షియల్ గా హిట్టవ్వాలని దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి చాలా బలంగా కోరుకుంటున్నాడు. అయితే సినిమాకు సంబందించిన ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే నితిన్ టార్గెట్ ను అందుకోవడం పెద్ద కష్టమేమి కాదని అనిపిస్తోంది. చెక్ సినిమపై మొదటి నుంచి కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ అవుతున్నాయి.
ట్రైలర్ కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక సినిమా ప్రీ రిలీజ్ విషయానికి వస్తే.. ఎపి తెలంగాణాలో సినిమా 15కోట్ల వరకు బిజినెస్ చేస్టసున్నట్లు తెలుస్తోంది. ఇక కర్ణాటక, ఓవర్సీస్..రెస్ట్ ఆఫ్ ఇండియా.. మొత్తం 1.1కోట్ల వరకు ధర పలికింది. టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా 16.10కోట్ల బిజినెస్ చేస్తోంది. ఇక చెక్ సక్సెస్ కావాలి అంటే బ్రేక్ ఈవెన్ టార్గెట్ 16.5కోట్లను రాబట్టాలి. నితిన్ గత హిట్ సినిమాలు అందించిన లాభాలను పరిగణలోకి తీసుకుంటే ఈ టార్గెట్ ను అందుకోవడం పెద్ద కష్టమేమి కాదని తెలుస్తోంది.
ఇక సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్స్ గా నటించారు. ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టి ఫామ్ లోకి రావాలని రకుల్ తో పాటు ప్రియా ప్రకాష్ కూడా బలంగా కోరుకుంటోంది.