సహజంగా సినిమా రంగంలో హీరోయిన్స్ అంటే…డబ్బు కోసం గ్లామర్ ఆరబోయడం.. ఎక్స్ పోజింగ్ ద్వారా పేరు తెచ్చుకోవడం.. అవకాశాల కోసం కాకాపట్టడం.. ఇలా ఎన్నో పనులు చేస్తూ ఉంటారు. కానీ నా రూటే సేపరేటు అంటుంది ఈ అందాల భామ నిత్యా…అదే క్రమంలో తాను నచ్చితేనే చేస్తా….అంటూ తాను చేస్తున్న పనుల వల్ల, ఈ అమ్మడికీ కాస్త పొగరు అన్న పేరు సైతం వచ్చింది.
ఇదిలా ఉంటే తాజాగా పర్సనల్ లైఫ్ విషయాలను బయటకు చెప్పడానికి ఒప్పుకొని హీరోయిన్స్ లాగా కాకుండా నేను చాలా ఓపెన్ అంటూ, తన లైఫ్ లో జరిగిన ఒక లవ్ స్టోరీను అందరికీ చెప్పేసింది ఈ బ్యూటీ…ఆమె లవ్ స్టోరీని ఆమె మాటల్లోనే వినండి…నేను ఒక అబ్బాయిని ప్రేమించాను…కానీ ఆ ప్రేమ ఇప్పటిది కాదు, టీనేజ్ లో నేను కూడా లవ్ చేసా..తెలిసీతెలియని టీనేజ్లో ఒకబ్బాయిని ఒక అబ్బాయిని ఇష్ట పడ్డాను.. కానీ ఎందుకనో అతని ప్రవర్తన అంతగా నచ్చలేదు….కొన్నాళ్ల తరవాత అతనితో కలిసి జీవితాంతం ఉండలేనేమో అనిపించింది, అందుకే వెంటనే ఆ లవ్ మ్యాటర్ ను క్లోస్ చేసేసా అంటుంది..
ఇక అదే క్రమంలో ప్రస్తుతం మీరు గ్లామర్ ఫీల్డ్ లో ఉన్నారు… ఇప్పుడేమైన అలాంటి ఆలోచన ఉందా…ప్రేమిస్తున్నారా ఎవరినైనా అంటే….ఇప్పుడు వాటి గురించి ఆలోచించే టైమే లేదంటోంది. అంతేకాదు.. కనీసం ఫేస్ బుక్ , ట్విట్టర్ వంటి ఖాతాలను మెయింటైన్ చేసే ఆలోచన కూడా లేదట. కాలేజీ రోజుల్లోనే ఆమె తన ఫేస్బుక్ ఎకౌంట్ క్లోజ్ చేసిందట. ఏది ఏమైనా…నిత్యాను మెచ్చుకోవాల్సిందే, తన పర్సనల్ విషయాలను కూడా భయపడకుండా చెప్పినందుకు…