“అసలు ఎవరైనా మనల్ని లైంగికంగా వేధించడానికి ఎందుకు ప్రయత్నిస్తారు.. మనం వారికి మెంటల్లీ వీక్ గా కనిపిస్తేనే కదా. అందుకే నేను ఎవరికీ వీక్ గా కనిపించడం కాదు కదా కనీసం తను వీక్ గా ఉంది అన్న ఆలోచన కూడా రానివ్వను. అందుకే ఇప్పటివరకూ ఎవరూ నన్ను లైంగికంగా వేధించే ధైర్యం చేయలేదు” అంటోంది నిత్యామీనన్. ప్రస్తుతం పెరుగుతున్న “మీ టూ” కంప్లైంట్లు భయపెడుతున్నాయి. అయితే.. ఈ ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే చట్టం మాత్రమే కాదు వ్యక్తిత్వం పరంగానూ చాలా మార్పులు కావాలి. త్వరలోనే ఈ పరిస్థితిలో మార్పు వస్తుంది అని ఆశాభావం వ్యక్తం చేసింది నిత్యామీనన్.
నిత్యామీనన్ ప్రస్తుతం ఎన్టీఆర్ బయోపిక్ లో సావిత్రిగా నటిస్తుండడంతోపాటు.. “ప్రాణ” అనే బైలింగువల్ సినిమా కూడా చేస్తోంది. ఈ రెండు సినిమాలు కాకుండా అక్షయ్ కుమార్ తో కలిసి ఒక బాలీవుడ్ సినిమా కూడా చేస్తోంది నిత్యామీనన్.