అభినేత్రి సావిత్రి జీవితాన్ని నాగ్ అశ్విన్ మహానటి చిత్రం ద్వారా అద్భుతంగా ఆవిష్కరించారు. ఇందులో సావిత్రిగా కీర్తి సురేశ్ నటనకు సామాన్యులతో పాటు సెలబ్రిటీలు సైతం ఫిదా అయిపోయారు. భారీ కలక్షన్స్ రాబట్టిన ఈ చిత్రంలో సావిత్రిగా నటించడానికి ముందుగా నిత్యా మీనన్ ని సంప్రదించారు. “అలా మొదలైంది” సినిమాతో తెలుగువారికి పరిచయమైన ఈ నటికి దక్షణాది భాషల్లో మంచి ఫాలోయింది. అందుకే నాగ్ అశ్విన్ ఆమెను ఎంచుకున్నారు. నిత్యా మీనన్ కూడా ఈ ఆఫర్ ముందు ఓకే చెప్పిందని వార్తలు వచ్చాయి. ఈ విషయంపై ఆమెను ప్రశ్నించగా ఆసక్తికర సమాధానం ఇచ్చింది.
“నన్ను సావిత్రిలా ఉన్నావని చాలా మంది అభినందిస్తుంటారు. అప్పుడు ఎంతో సంతోషం వేసేది. ‘మహానటి’లో నటించమని అడిగితే, అంత అద్భుతమైన పాత్రను వదులుకోలేక, చేస్తానని చెప్పాను. అయితే, ఆపై కొన్ని కారణాల వల్ల సినిమాను వదులుకున్నాను. ‘మహానటి’ని వదులుకున్న కారణాలను మాత్రం చెప్పలేను” అని వెల్లడించింది. ఎంత ప్రయత్నించినా ఆ విషయాన్ని నిత్య బయటికి చెప్పలేదు. ఇందుకు సమాధానం దొరకాలంటే నాగ్ అశ్విన్ నోరు తెరవాల్సి ఉంటుంది.