తలైవార్..షాక్ ఇచ్చాడు!!!

  • June 8, 2016 / 07:10 AM IST

తమిళ తలైవార్ రజనికాంత్ అభిమానులకు షాక్ ఇచ్చాడు. ఎన్నో ఆశలతో ఎదురు చూస్తున్న అభిమానునలు నిరాశపరిచాడు. ఇంతకీ విషయం ఏమిటంటే…రజనికాంత్ గత రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద అనుకున్నంత హిట్ సాధించలేకపోయాయి. అయినా తాజాగా రజని నటిస్తున్న కబాలి చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక అదే క్రమంలో ఈ మధ్యనే విడుదలయిన కబాలి టీజర్ సూపర్ హిట్ కావడంతో అంచనాలు తారా స్థాయికి చేరాయి.

ఇదిలా ఉంటే ఈ సినిమా ఆడియో జూన్ 12న విడుదల అవుతుంది అన్న ఆలోచనతో ఆశగా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కు అనుకోకుండా షాక్ తగిలింది. ఏ ఫంక్షన్, హడావిడి, లేకుండా ఈ సినిమా పాటలను డైరెక్ట్ గా ఆన్ లైన్లో రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. సంతోష్ నారాయణ్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా సాంగ్స్ ఇక డైరెక్ట్ గా ఆన్లైన్లో వినడమే. దానికి గల కారణాలు తెలీదు కానీ, ఇలా లాస్ట్ మినిట్ లో ఆడియో వేడుక ఎందుకు కాన్సిల్ చేశారో అన్న సందేహంలో అభిమానులు బాద పడుతున్నారు.

ఇదే క్రమంలో జూన్ 12న రిలీజ్ అవ్వాల్సిన ఆడియో ఆగిపోవడంతో ఫ్యాన్స్ సినిమా అనుకున్న టైంకు వస్తుందా లేదా అన్న కన్ ఫ్యూజన్ లో పడ్డారు. జూలై 1 కబాలి రిలీజ్ అని వార్తలు వస్తున్నా ఆ డేట్ ఇంకా ఫైనలైజ్ చేయలేదు దర్శక నిర్మాతలు. అయితే జూలై 1న మిస్ అయినా ఒక వారం గ్యాప్ తో అంటే 7,8 తేదిల్లో రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయట. మరి రజిని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న కబాలి ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus