రజనీ లేకుండానే ‘కబాలి’ ఆడియో.. ?

  • June 7, 2016 / 12:47 PM IST

సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం ‘కబాలి’. పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంతోష్ నారాయణ్ స్వరాలు అందిస్తున్నారు. ఈ చిత్ర ఆడియోను జూన్ 12 న చెన్నైలో ఘనంగా విడుదల చేయాలని ముందుగా అనుకున్నప్పటికీ.. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర గీతాలను నేరుగా ఆన్లైన్ లో విడుదల చేయనున్నారట.

రజనీకాంత్ ఈ కార్యక్రమానికి గైర్హాజరీ కారణం గానే ఈ చిత్ర గీతాలను నేరుగా ఆన్లైన్ లో విడుదల చేస్తున్నారని అంటున్నారు. కాగా ప్రస్తుతం రజనీ అమెరికా పర్యటనలో ఉన్నారు. మరోవైపు ఈ చిత్రం జూలై 1 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus