దర్శకుడు తేజ లెక్క మరోసారి తప్పింది. ఆయన తాజా సినిమా సీత బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. కమర్షియల్‌గా కొనుగోలుదారులకు నష్టాలు తప్పడం లేదు. తేజకు ఒక హిట్ తర్వాత మరో హిట్ తీయడం కష్టమే. నేనే రాజు – నేనే మంత్రితో ఫామ్‌లోకి వచ్చిన ఆయన ఆ తర్వాతి సినిమా చేయడానికి చాలా సమయం తీసుకున్నారు. మధ్యలో ఎన్టీఆర్ బయోపిక్ సినిమా చేయాల్సింది. కానీ చివరి క్షణంలో తప్పుకున్నారు. వెంకటేష్ సినిమా సైతం వాయిదా పడింది. ఆ తర్వాత సీత సినిమా పట్టాలెక్కింది. తనకు ఇష్టమైన హీరోయిన్ కాజల్ ప్రధాన పాత్రగా ఈ సినిమా తీశారు.
హీరో పాత్ర చేయడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ను తీసుకున్నారు. ఇక కథ విషయానికి వస్తే లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్. కథనం నెమ్మదించింది అనే విమర్శలు వచ్చాయి. హీరో, హీరోయిన్లకు కాకుండా సోనుసూద్ పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. టోటల్‌గా సినిమా తేలిపోయింది. తాజా ఫ్లాప్‌తో తేజ భవిష్యత్తు ఎలా ఉంటుంది? మళ్లిd మరో సినిమా చేయడానికి ఆయనకు చాలా సమయం పట్టవచ్చు.