కత్తి కథ మారలేదు!

  • June 16, 2016 / 10:43 AM IST

మెగాస్టార్ చిరంజీవి తన 150వ సినిమా కోసం కసరత్తులు చేస్తున్నాడు. అయితే గత కొంత కాలంగా చిరంజీవి 150వ సినిమా క‌థ మారుతుందని.. వినాయ‌క్ క‌త్తి స్థానంలో ఓ కొత్త క‌థ రాసుకొచ్చాడని.. కొన్ని మాటలు వినిపిస్తున్నాయి.

ప్ర‌స్తుతం చిరు అభిమానుల్ని వేధిస్తున్న ప్ర‌శ్న‌లివి. 150వ చిత్రంగా క‌త్తి రీమేక్ చేయ‌డానికి రంగం సిద్ధ‌మైన సంగ‌తి తెలిసిందే. అయితే ఈలోగా ఓ గాసిప్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. క‌త్తి క‌థ‌ని ప‌క్క‌న పెట్టేశార‌ని, కొత్త క‌థ తెర‌కెక్క‌బోతంద‌న్న‌ది ఆ గాసిప్ సారాంశం. క‌త్తి క‌థ‌లో ఎంట‌ర్‌టైన్‌మెంట్ మిస్స‌యిపోయింద‌ని, పైగా ఆ క‌థ అంద‌రికీ తెలిసిపోయింద‌ని, ఇప్పుడు తీస్తే కిక్ ఉండ‌ద‌ని చిరు భావించాడ‌ని, అందుకే వినాయ‌క్ మ‌రో క‌థ రెడీ చేశాడ‌ని చెబుతున్నారు.

అయితే ఈ పుకార్ల‌ను క‌త్తి టీమ్ కొట్టి పారేసింది. క‌త్తి రీమేక్ ఖాయ‌మ‌ని, అయితే అందులో చిరంజీవి శైలికి త‌గిన మార్పులు జ‌రిగాయ‌ని వినాయ‌క్ స‌న్నిహితులు చెబుతున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus