సీనియర్ నటుడు శరత్ బాబు నిన్న మరణించిన సంగతి తెలిసిందే. కొంతకాలంగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వచ్చిన సంగతి తెలిసిందే. కిడ్నీ ఫెయిల్యూర్, బ్లడ్ ఇన్ఫెక్షన్ తో హాస్పిటల్ లో అడ్మిట్ అయిన శరత్ బాబు… బెంగళూరులో ట్రీట్మెంట్ తీసుకుంటుండగా మెరుగైన వైద్యం నిమిత్తం ఆయన్ని హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రికి మార్చారు. అయితే పరిస్థితి విషమించడంతో నిన్న కన్నుమూశారు. ఈ విషయాన్ని వైద్య సిబ్బంది వెల్లడించింది. శరత్ బాబు నివాసం చెన్నైలో ఉన్నందున ఆయన పార్ధీవ దేహాన్ని అక్కడికి మార్చడం జరిగింది.
శరత్ బాబు (Sarath Babu) పార్థీవ దేహాన్ని సందర్శించేందుకు చెన్నైలో ఉన్న సినీ ప్రముఖుల అందరూ తరలివెళ్లారు. ఈరోజే అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అయితే శరత్ బాబుకి తలకొరివి ఎవరు పెడతారు అనే విషయం పై సందిగ్థం నెలకొంది. శరత్ బాబు మొదట నటి రమాప్రభని పెళ్లి చేసుకున్నారు. 14 ఏళ్లు కాపురం చేసిన తర్వాత మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకున్నారు. రెండేళ్ల తర్వాత తమిళ నటుడు నంబియార్ కూతురు స్నేహను వివాహం చేసుకున్నారు.
ఆమెతో కూడా మనస్పర్థలు రావడంతో 2011లో విడాకులు తీసుకున్నారు. రెండు పెళ్లిళ్లు చేసుకున్నప్పటికీ శరత్ బాబుకు సంతానం కలగలేదు.మరోపక్క శరత్ బాబుకు ఏడుగురు అన్నదమ్ములు, ఆరుగురు అక్కాచెల్లెళ్లు ఉన్నారు. వీళ్ళ మొత్తానికి 25 మంది వరకు సంతానం ఉన్నట్టు తెలుస్తుంది. వీరిలో ఎవరో ఒకరు శరత్ బాబుకు తలకొరివి పెట్టే అవకాశం ఉందని తెలుస్తుంది. మరోపక్క శరత్ బాబు భార్యలు అంత్యక్రియలకు వెళ్తారా? అనే ప్రశ్నలు కూడా వ్యక్తమవుతున్నాయి.
బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!
అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు