‘దసరా’ సినిమాకి హిందీలో హైప్ లేదా.. మేటర్ ఏంటి?

  • March 8, 2023 / 04:16 PM IST

నాని కొన్నాళ్ల నుండి ఓ పెద్ద హిట్టు కొట్టాలని ప్రయత్నిస్తున్నాడు కానీ.. తాను తీసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్ద రేంజ్లో సక్సెస్ కావడం లేదు. ‘జెర్సీ’ సినిమా హిట్ అయినా భారీగా కలెక్ట్ చేయలేదు. ‘నానీస్ గ్యాంగ్ లీడర్’ ప్లాప్ అయ్యింది. ‘వి’ ‘టక్ జగదీష్’ సినిమాలు ఓటీటీకి వెళ్లి సేఫ్ అయ్యాయి. ‘శ్యామ్ సింగ రాయ్’ డీసెంట్ హిట్ అందుకున్నా.. ‘అంటే సుందరానికి’ చిత్రం మంచి టాక్ సంపాదించుకున్నా బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయ్యింది.

దీంతో ‘దసరా’ సినిమాతో హిట్ కొట్టి బౌన్స్ బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు నాని.’ఎస్ ఎల్ వి సినిమాస్’ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ బ్యానర్లో ఒక్క హిట్టు కూడా లేదు. పైగా నాని ‘దసరా’ కి రూ.70 కోట్లు బడ్జెట్ పెట్టారు. పాన్ ఇండియా మూవీగా ఈ చిత్రాన్ని రూపొందించారు. డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కూడా కొత్త కుర్రాడు.అయినప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి బిజినెస్ బాగానే జరిగింది.

కానీ హిందీలో మాత్రం ఆశించిన స్థాయిలో బిజినెస్ జరగడం లేదు అని వినికిడి. దీంతో ‘ఏ ఏ ఫిలిమ్స్’ వారు రెంట్ పద్ధతిలో ఈ చిత్రాన్ని హిందీలో రిలీజ్ చేయబోతున్నట్టు వినికిడి. హిందీలో ఈ చిత్రానికి హైప్ తీసుకురావడం కోసం ఆల్రెడీ నాని నార్త్ కు వెళ్ళాడు. ట్రైలర్ లాంచ్ అక్కడే నిర్వహిస్తారని తెలుస్తుంది.

పాన్ ఇండియా సినిమాలకు హిందీ మార్కెట్ చాలా కీలకం. అక్కడ తొలిరోజు పాజిటివ్ టాక్ ను రాబట్టుకుంటే చాలు వీక్ డేస్ లో కూడా కలెక్షన్లు చాలా బాగా వస్తాయి. అందుకే ‘దసరా’ టీం అక్కడ స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus