పాపం తమన్నా, మెహరీన్ లు… ఇప్పటి వరకూ సరైన హిట్టు కోసం చాలా కాలంగా ఎదురు చూసారు. ఎట్టకేలకు ‘ఎఫ్2’ రూపంలో ఓ భారీ సక్సెస్ దక్కింది. ఇంకేముంది దీన్ని క్యాష్ చేసుకుని మరిన్ని ఆఫర్లు కొట్టేద్దాం అని ఎన్నో అసలు పెట్టుకున్నారట. అయితే అలాంటి పరిస్థితులేమి ప్రస్తుతం కనిపించడం లేదు. ఇప్పట్లో హీరోయిన్ కి బాక్సాఫీస్ వద్ద పెద్ద సక్సెస్ ఉన్నప్పటికీ … కొత్త సినిమాలకి ఆయా హీరోయిన్ల క్రేజ్ యాడ్ అవుతుంది.. అనుకుంటేనే దర్శకనిర్మాతలు హీరోయిన్లకు ఛాన్సులు ఇస్తున్నారట.
మొన్నటి వరకూ సక్సెస్ లేదు కాబట్టి ఆఫర్స్ రావడం లేదని తమన్నా, మెహ్రీన్ లు భావించారు. కానీ ఇప్పుడు 100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను సాధించిన సినిమా దక్కినా వీళ్ళకి ఎదురు చూపులు తప్పడం లేదు. అసలు దీనికి కారణాన్ని పరిశీలిస్తే… ఈ చిత్ర సక్సెస్ లో ఎక్కువ క్రెడిట్ హీరో వెంకటేష్ కు అలాగే దర్శకుడు అనిల్ రావిపూడికి దక్కింది. హీరో వరుణ్ కి కూడా మంచి మార్కులే పడ్డాయి. ఈ క్రమంలో తమన్నా – మెహ్రీన్ ల పాత్రలు గ్లామర్ కోసమే అన్నట్టు అయిపొయింది. ఈ కారణంగానే ‘ఎఫ్2’ బ్యూటీలను ఎవరూ పట్టించుకోవట్లేదని ఫిలింనగర్ విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు.