టాలీవుడ్ హీరోయిన్లలో ఒకరైన కీర్తి సురేష్ సర్కారు వారి పాట సినిమాతో చాలా కాలం తర్వాత తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ సాధించారు. ఈ సినిమాలో కీర్తి సురేష్ గ్లామరస్ గా కనిపించడం గమనార్హం. అయితే సర్కారు వారి పాట సక్సెస్ సాధించినా తెలుగులో కొత్త ప్రాజెక్ట్ లలో కీర్తి సురేష్ పేరు వినిపించడం లేదు. స్టార్ హీరోలు ఆమెకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ఇతర టాలీవుడ్ హీరోయిన్లతో పోల్చి చూస్తే కీర్తి సురేష్ వెనుకబడ్డారని చెప్పాలి.
మహానటి సక్సెస్ తర్వాత కీర్తి కెరీర్ విషయంలో చేసిన పొరపాట్లు ఈ స్థితికి కారణమని కామెంట్లు వినిపిస్తున్నాయి. మహానటి తర్వాత లేడీ ఓరియెంటెడ్ ప్రాజెక్ట్ లకు కీర్తి సురేష్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా ఆ సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించలేదు. ఈ సినిమాలు నటిగా కీర్తి సురేష్ కెరీర్ కు కూడా పెద్దగా ఉపయోగపడలేదు. ఈ సినిమాలలో నటించకుండా స్టార్ హీరోల సినిమాలకు ప్రాధాన్యత ఇచ్చి ఉంటే ప్రస్తుతం కీర్తి సురేష్ కెరీర్ మరో విధంగా ఉండేది.
కీర్తి సురేష్ భవిష్యత్తులో కూడా లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు దూరంగా ఉంటే మంచిదని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. కథ, పాత్రలకు ప్రాధాన్యత ఇస్తూ స్టార్ హీరోల సినిమాలలో ఆఫర్లు సంపాదించుకుంటే కీర్తి సురేష్ కెరీర్ కు ప్లస్ అవుతుంది. కీర్తి సురేష్ ప్రస్తుతం తెలుగులో భోళా శంకర్ సినిమాలో చిరంజీవి చెల్లి పాత్రలో దసరా సినిమాలో హీరోయిన్ రోల్ లో కనిపించనున్నారు.
ఈ రెండు సినిమాలు సక్సెస్ సాధిస్తే మాత్రమే కీర్తికి కొత్త ఆఫర్లు వచ్చే ఛాన్స్ అయితే ఉంది. కీర్తి సురేష్ కెరీర్ విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాల్సి ఉంది. మిడిల్ రేంజ్ హీరోలకు జోడీగా కొత్త ఛాన్స్ లు వచ్చినా కీర్తి సురేష్ ఓకే చెబితే బెటర్ అని కామెంట్లు వినిపిస్తున్నాయి. కీర్తి సురేష్ ప్రస్తుతం ఒక్కో సినిమాకు కోటిన్నర రూపాయల నుంచి 2 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.
Most Recommended Video
విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!