ఆ సినిమా సీక్వెల్ గల్లంతయ్యిందే!

  • June 9, 2016 / 07:20 AM IST

“అ ఆ” సినిమా విడుదలకు ముందు వరకూ.. ఆ సినిమా తర్వాత నితిన్ “గుండెజారి గల్లంతయ్యిందే”కి సీక్వెల్ గా విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలోనే సీక్వెల్ లో నటించనున్నాడంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కానీ.. “అ ఆ” అఖండ విజయం సాధించడంతో ఆ సినిమా సీక్వెల్ అటకెక్కిందని తెలుస్తోంది.

విజయ్ కుమార్ కొండా మునుపటి చిత్రం “ఒక లైలా కోసం” డిజాస్టర్ గా నిలవడం కూడా నితిన్ అతడ్ని పక్కనపెట్టడానికి కారణమని తెలుస్తోంది. ఇకపోతే.. నితిన్ తన తదుపరి చిత్రం “నేను శైలజ” ఫేమ్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో అని ఇటీవల కన్ఫర్మ్ అయ్యింది. సో, నితిన్ “గుండెజారి గల్లంతయ్యిందే” సీక్వెల్ ను పక్కన పెట్టేసినట్లేగా. ఏంటో మన హీరోలు హిట్ ఉన్న దర్శకుల వెనుకే పడతారెప్పుడూ!!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus