అటు సింగర్ గా పాటలు పడుతూనే… ఇటు వైపు విభిన్న పత్రాలు పోషిస్తూ నటుడుగా కూడా రాణిస్తున్నాడు నోయెల్. ‘కుమారి 21 ఎఫ్’ చిత్రంతో నోయెల్ కు మంచి గుర్తింపు దక్కింది. మగధీర, ఈగ, ప్రేమమ్, నాన్నకు ప్రేమతో, రంగస్థలం వంటి చిత్రాల్లో నటించి మెప్పించాడు. తాజాగా నోయెల్ పెళ్ళిపీటలెక్కబోతున్నాడు.
గతంలో తేజ డైరెక్షన్లో ‘1000 అబద్దాలు’ చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమయ్యింది ఎస్తేర్ నొరోన్హా. ఆ తరువాత సునీల్ హీరో గా చేసిన ‘భీమవరం బుల్లోడు’ చిత్రంలో కూడా హీరోయిన్ గా నటించింది. హీరోయిన్ గా సక్సెస్ కాకపోవడంతో ‘జయ జానకి నాయకా’ చిత్రంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా నటించింది. మంగలూర్ కు చెందిన ఈ కొంకణి అమ్మాయి హీరోయిన్ గా సక్సెస్ కానప్పటికీ మంచి ప్రతిభ కలిగిన అమ్మాయి అనడంలో సందేహం లేదు. ఎస్తేర్ నొరోన్హా కు భరతనాట్యం, పాటలు పాడడం వంటి వాటిలో దిట్ట.. అంతేకాదు విదేశాల్లో షోలు కూడా ఇస్తుంటుంది. ఇప్పుడు ఈ భామనే నోయెల్ పెళ్ళి చేసుకోబోతున్నాడు. ఇటీవల వీరిద్దరి నిశ్చితార్థం జరిగింది. తాజాగా ఈ విషయాన్ని రివీల్ చేసాడు నోయెల్. త్వరలోనే ఈ జంట పెళ్ళి పీటలెక్కబోతుంది.