Ram Charan: నాన్‌స్టాప్‌ స్టెప్‌లు… చరణ్‌ మొదలుపెట్టాడు.. నెక్స్ట్‌ హీరోలందరూ చేయాల్సిందేనా?

Advertisement

టాలీవుడ్‌లో ఇప్పుడు నడుస్తున్న అతి పెద్ద చర్చల్లో ‘నాన్‌స్టాప్‌ స్టెప్‌లు’ ఒకటి. ‘పెద్ది’ సినిమాలోని ‘రై రై రారా’ పాటలో చరణ్‌ రెండుసార్లు నాన్‌స్టాప్‌ స్టెప్పులు వేశాడు. చూడటానికి ఈజీగా కనిపించాయి కానీ.. చేయడం చాలా కష్టం. ఆ స్టెప్పులను నిశితంగా గమనిస్తే మీకే అర్థమవుతుంది. వరుస పెట్టి స్టెప్పులను ఏదో పూనకం వచ్చినవాడిలా వేసి అలరించాడు. నిజానికి ఇది ఫస్ట్‌ టైమ్‌ కాదు. గతంలో కూడా ఇలా డ్యాన్స్‌ చేశాడు. అందుకే స్టార్‌ డ్యాన్సర్‌ అని పేరు సంపాదించాడు.

Ram Charan

అయితే, అది కెరీర్‌ ప్రారంభించిన కొత్తల్లో చేశాడు. ‘గేమ్‌ ఛేంజర్‌’ సినిమాతో మరోసారి నాన్‌స్టాప్‌ డ్యాన్స్‌ని చూపించాడు చరణ్‌. అయితే ఆ సినిమా దారుణమైన పరాజయాన్ని అందుకోవడంతో అవి గుర్తులేవు. ఇప్పుడు ‘పెద్ది’తో మరోసారి తనెంత గొప్ప డ్యాన్సర్‌ అనేది చేసి చూపించాడు. చరణ్‌ బాడీ లాంగ్వేజీకి తగ్గట్టు కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌ స్టెప్పులను కంపోజ్‌ చేశాడు. వాటిని తన గ్రేస్‌ను జోడించి మరింత అందంగా మార్చాడు చరణ్‌. దీంతో సినిమాలోని మిగిలిన పాటల్లోనూ ఇలాంటి స్టెప్పులు కావాలి అని ఫ్యాన్స్‌ అడిగే పరిస్థితి వచ్చింది.

అయితే, ఇక్కడ వచ్చిన సమస్య అది కాదు. పాటకు అవసరమైతే చరణ్‌ ఆ స్టెప్పులేస్తాడు కూడా. సమస్యల్లా ఇతర హీరోల ఫ్యాన్స్‌ నుండి వస్తున్న/ రానున్న డిమాండ్లు. చరణ్‌లా తమ హీరో కూడా కొత్త సినిమాల్లో నాన్‌స్టాప్‌ స్టెప్పులేయాలి, తామెంత గొప్ప డ్యాన్స్‌ అనేది నిరూపించాలి అని ఫ్యాన్స్‌ నుండి డిమాండ్లు వస్తున్నాయి. ఒకవేళ వాళ్లు అలా చేయాలి అంటే దానికి తగ్గ కథల్లో నటించాలి. చరణ్‌ ఇప్పుడు ఇలా డ్యాన్స్‌ చేశాడు అంటే ఈ సినిమా పూర్తి మాస్‌ కథ.

చరణ్‌ సమకాలీన హీరోలు ఇప్పుడు చేస్తున్న సినిమాల్లో ఇలాంటి మాస్‌ పాటలు పెట్టే పరిస్థితి లేదు. ఈ లెక్కన ఆ హీరోల అభిమానులు ఇప్పట్లో ఇలాంటి నాన్‌స్టాప్‌ డ్యాన్స్‌లు ఆశించలేం. చూద్దాం ఏదైనా స్పేస్‌ క్రియేట్‌ చేసుకొని డ్యాన్స్‌ చేస్తారేమో.

మృత్యుంజయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus