అసలు కొన్ని బి గ్రేడ్ షార్ట్ ఫిలిమ్స్ లో నటించేవాడు అనే ముద్ర ఉంది. అందులోనూ ‘హైపర్’ ఆది కూడా పదే పదే అతని మీద అలాంటి పంచ్ డైలాగులే వేస్తాడు. మరి ఇలాంటి పరిస్థితుల్లో.. సెక్స్ రాకెట్ స్కామ్ లో దొరికిపోయాడు. ఇలాంటి పరిస్థితుల్లో ‘అతని కెరీర్ కల్లాస్’ అని అంతా ఫిక్సయిపోవడం సహజం. ఫ్యామిలీ కూడా అతన్ని వెలేసినా ఆశ్చర్యం లేదు. సోషల్ మీడియాలో దీని పై డిస్కషన్లు కూడా మొదలైపోయాయి.! ఎవరి గురించి చెబుతున్నానో తెలిసు కదా. యెస్ మన ‘జబర్థస్త్’ కమెడియన్ దొరబాబు గురించే..!
కానీ ఎవ్వరూ ఊహించని విధంగా అతని భార్య నందు అలియాస్ అమూల్య కూడా అతన్ని వెనకేసుకొచ్చింది. అంతేనా.. ఓ టాటూ వేయించుకుని నాకు దొరబాబు తప్ప ఎవ్వరూ వద్దు అనేంతలా కామెంట్ కూడా పెట్టింది. ‘ఇంత మంచి భార్యను పెట్టుకుని ఇవేం పనులు దొరబాబు’ అని నెటిజన్లు మళ్ళీ కామెంట్స్ చేశారు. భార్య అంటే క్షమించింది కానీ తన కెరీర్ విషయంలో ఇబ్బందులు తప్పవు అని మరిన్ని అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే కెరీర్ విషయంలో కూడా దొరబాబు సేఫ్..! ఇప్పటికే టీం లీడర్ హైపర్ ఆది.. మల్లెమాల వాళ్ళతో మాట్లాడి కన్వెన్స్ చేసాడట. ఒకవేళ జబర్దస్త్ టీం అతన్ని తీసేసే చర్యలు తీసుకోవాలి అనుకున్నా.. మరో పక్క ‘జీ తెలుగు’లో ప్రసారమయ్యే ‘అదిరింది’ కామెడీ షోకి దొరబాబుని తీసుకోవాలి అని నాగబాబు అండ్ టీం భావిస్తున్నారట. కాబట్టి దొరబాబుకి కెరీర్ విషయంలో ఢోకా లేనట్టే..!