నవంబర్ నెలలో హిట్టైన సినిమాలు ఇవి మాత్రమేనా?

  • December 1, 2022 / 11:21 AM IST

ప్రతి నెలా పదుల సంఖ్యలో థియేటర్లలో సినిమాలు రిలీజవుతాయి. రిలీజైన సినిమాలలో హిట్టైన సినిమాలు ఎన్ని అనే ప్రశ్నకు ఆ సినిమాలను వేళ్ల మీద లెక్క పెట్టవచ్చని సమాధానం వినిపిస్తుంది. సాధారణంగా నవంబర్ నెలలో పెద్ద సినిమాలను థియేటర్లలో రిలీజ్ చేయడానికి నిర్మాతలు ఆసక్తి చూపరు. నవంబర్ నెలలో విడుదలై 30 కోట్ల రూపాయల కలెక్షన్లు సాధించిన సినిమాలు కూడా లేవనే సంగతి తెలిసిందే. ఈ ఏడాది నవంబర్ విషయానికి వస్తే ఫస్ట్ వీక్ లో విడుదలైన ఊర్వశివో రాక్షసివో సినిమా పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది.

యూత్ ను టార్గెట్ చేసి తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. మరీ భారీ స్థాయిలో లాభాలు రాకపోయినా ఈ సినిమా బడ్జెట్ తో పోల్చి చూస్తే ఈ సినిమా సేఫ్ ప్రాజెక్ట్ అని చెప్పవచ్చు. నవంబర్ సెకండ్ వీక్ లో యశోద మూవీ థియేటర్లలో రిలీజ్ కాగా ఈ సినిమా పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఆసక్తికర ట్విస్టులతో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోవడంతో ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు.

ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నవంబర్ మూడో వారంలో విడుదలైన సుధీర్ గాలోడు, కావ్య కళ్యాణ్ రామ్ మసూద సినిమాలు పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకున్నాయి. ఈ రెండు సినిమాలు ప్రేక్షకులకు ఎంతగానో నచ్చాయి. నవంబర్ నెల చివరి వారంలో డబ్బింగ్ మూవీ అయిన లవ్ టుడే విడుదలై పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది.

ఈ సినిమా ప్రేక్షకులకు ఎంతగానో నచ్చింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యి నిర్మాతలకు లాభాలను అందించింది. నవంబర్ నెలలో విడుదలైన మిగతా సినిమాలు మాత్రం కమర్షియల్ గా సక్సెస్ సాధించడంలో ఫెయిలయ్యాయి.

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus