నవంబర్ 13 న (మంగళవారం రాత్రి) నటుడు రాజశేఖర్ కారు యాక్సిడెంట్ కు గురైన సంగతి తెలిసిందే. పెద్ద ప్రమాదం నుండీ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ ఘటన పెద్ద చర్చకు దారితీయడంతో ప్రెస్ మీట్ పెట్టి మరీ అభిమానులను కంగారు పడొద్దంటూ జీవితరాజశేఖర్ లు చెప్పుకొచ్చారు. అయితే రాజశేఖర్ కానీ.. ఆయన కుటుంబం కానీ ఇలా యాక్సిడెంట్ లకు గురవ్వడం మొదటిసారి కాదు. ఇది వరకూ కూడా జరిగాయి.
వివరాల్లోకి వెళితే.. అప్పట్లో పీవీ ఎక్స్ ప్రెస్ హైవే పై కూడా ప్రమాదం జరిగింది. అప్పుడు కూడా స్వల్ప గాయాలతో బయటపడ్డాడు రాజశేఖర్. ‘తన తల్లి చని పోయిన బాధ లో ఉండటం డిప్రెషన్ లోకి వెళ్ళడంతో ఆ ప్రమాదం జరిగిందని’ అప్పుడు రాజశేఖర్ వివరణ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఘటన సరిగ్గా నవంబర్ నెలలోనే జరిగిందట. అంతేకాదు తరువాత రాజశేఖర్ కుమార్తె శివానీ ప్రయాణిస్తోన్న కారు సైతం జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద పెద్ద ప్రమాదానికి గురయ్యింది. ఇది కూడా నవంబర్ నెలలోనే జరిగింది. ఇప్పుడు జరిగిన సంఘటన కూడా నవంబర్ లోనే..! చూస్తుంటే… నవంబర్ నెల రాజశేఖర్ కు కానీ ఆయన కుటుంబానికి కానీ.. బ్యాడ్ సెంటిమెంట్ గా మారినట్టు స్పష్టమవుతుంది.