ఈసారి జక్కన్నకు హీరోలు కూడా హ్యాండిచ్చారు..!

  • June 25, 2020 / 03:59 PM IST

ఏ ముహూర్తాన రాజమౌళి.. ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం మొదలు పెట్టాడో కానీ.. అప్పటి నుండీ ఈ ప్రాజెక్ట్ కు ఏదో ఒక ఆటంకం వస్తూనే ఉంది. మొదట్లో హీరోయిన్ ఎన్టీఆర్ సరసన నటించాల్సిన లండన్ భామ డైసీ ఎడ్గర్ జోన్స్.. ఈ ప్రాజెక్ట్ నుండీ తప్పుకుంది. ఆ తరువాత మరో హీరోయిన్ ఒలివా మోరిస్ ను ఎంపిక చేసుకోవడానికి రాజమౌళి చాలా టైం తీసుకున్నాడు. ఇదిలా ఉండగా.. ఈ చిత్రం షూటింగ్లో భాగంగా హీరోలు చరణ్, ఎన్టీఆర్ లు గాయాలు పాలవ్వడంతో పూణె షెడ్యూల్ మొత్తం ఆగిపోయింది.

దీంతో 2020 జూలైలో విడుదల కావాల్సిన ఈ చిత్రం 2021 జనవరి 8 కి పోస్ట్ పోన్ అయ్యింది. పోనీలే అప్పటికైనా ఈ చిత్రం విడుదలవుతుంది అనుకుంటే సడన్ గా లాక్ డౌన్ వచ్చి షూటింగ్ లు ఆగిపోయేలా చేసింది. ఇప్పటికే దాదాపు 3 నెలల పాటు షూటింగ్ ఆగిపోయింది. ఈ క్రమంలో ప్రభుత్వం నుండీ షూటింగ్ లకు అనుమతులు లభించినప్పటికీ.. దర్శకుడు రాజమౌళి షూటింగ్ ను మొదలు పెట్టలేకపోయాడు.

త్వరలో షూటింగ్ ను మొదలు పెట్టాలి అని రాజమౌళి ప్లాన్ చేస్తున్నాడట. అయితే ఇందుకు హీరోలు చరణ్, ఎన్టీఆర్ లు మాత్రం అంగీకరించడం లేదట. ఇప్పుడు దేశమంతా క*నా కేసులు పెరుగుతున్న తరుణంలో షూటింగ్ మొదలుపెట్టడం శ్రేయస్కరం కాదని చరణ్, ఎన్టీఆర్ .. రాజమౌళికి తేల్చి చెప్పేస్తున్నారట. దాంతో ఇప్పుడు రాజమౌళికి మరో సమస్య వచ్చి పడిందని స్పష్టమవుతుంది.

Most Recommended Video

కృష్ణ అండ్ హిజ్ లీల సినిమా రివ్యూ & రేటింగ్
పెంగ్విన్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో అత్యధిక నష్టాలు మిగిల్చిన పది చిత్రాలు ఇవే

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus