ఖైదీ నంబర్ 150 మూవీపై స్పందించిన ఎన్టీఆర్

  • January 21, 2017 / 11:14 AM IST

మెగా, నందమూరి హీరోల మధ్య వృత్తిపరమైన పోటీ ఉంది. అయినప్పటికీ మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటసింహ బాలకృష్ణ సినిమా గౌతమి పుత్ర శాతకర్ణి గురించి గొప్పగా ట్వీట్ చేసారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా శాతకర్ణి టీమ్ కి శుభాకాంక్షలు చెప్పారు. తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్… మెగాస్టార్ చిరంజీవి చిత్రం ఖైదీ నంబర్ 150 మూవీ గురించి మాట్లాడినట్లు తెలిసింది. ఇది చిరు పై ఉన్న గౌరవంతో కాదు.. మిత్రుడు, తనకి ఆది, సాంబ, అదుర్స్ వంటి చిత్రాలను అందించిన వి.వి.వినాయక్ మీద అభిమానంతో స్పందించినట్లు సమాచారం.

వినాయక్, తారక్ మంచి మిత్రులు. ఇద్దరూ దాదాపు ఒకే సమయంలో కెరీర్ ఆరంభించారు. అప్పటి నుంచి వీరి మధ్య స్నేహం కొనసాగుతోంది. వినాయక్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న మూవీ సంక్రాంతికి రిలీజ్ అవుతుండగా ఎన్టీఆర్ అతనికి ఫోన్ చేసి ఆల్ ది బెస్ట్ చెప్పినట్లు టాక్. కొన్ని రోజుల క్రితం ఖైదీ నంబర్ 150 మూవీని చూసిన ఎన్టీఆర్.. వినాయక్ కి ఫోన్ చేసి సినిమా బాగుందని అభినందించినట్లు ఫిల్మ్ నగర్ వాసులు వెల్లడించారు. ఆ విధంగా ఎన్టీఆర్ నోటా ఖైదీ మాట వచ్చింది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus