‘ఎన్.బి.కే ఫిలిమ్స్’ మరియు ‘వారాహి చలన చిత్రం’ బ్యానర్ల పై నందమూరి బాలకృష్ణ, సాయి కొర్రపాటి కలిసి నిర్మిస్తున్న ‘ఎన్టీఆర్ – మహానాయకుడు’ చిత్రం ఈ శుక్రవారమే (ఫిబ్రవరి 22న) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎన్టీఆర్ రాజకీయ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం పై రోజుకో వార్త పుట్టుకొస్తుంది. ఎన్టీఆర్ సినీ జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘ఎన్టీఆర్ – కథానాయకుడు’ చిత్రం డిజాస్టర్ కావడంతో ఈ చిత్రం విషయంలో బాలకృష్ణ డైరెక్టర్ క్రిష్ లు ఎన్నో జాగ్రత్తలు తీసుకుని ఈ చిత్రాన్ని విడుదల చేస్తునన్నారు.
‘ఎన్టీఆర్ – కథానాయకుడు’ చిత్రంలో తలెత్తిన లోపాలను రిపీట్ కాకుండా ‘మహానాయకుడు’ కొన్ని రీ షూట్స్ చేసి మరీ… సినిమాని ప్రేక్షకులను మెప్పించేలా తీర్చిదిద్దారని టాక్ వినిపిస్తుంది. అయితే ట్విస్ట్ ఏమిటటంటే.. ‘కథానాయకుడు’ పై ఉన్న అంచనాలు ‘మహానాయకుడు’ లేకపోవడం గమనార్హం. ఈ చిత్రం పై బాలకృష్ణ, దర్శకుడు క్రిష్ కూడా సైలెంట్ అయిపోయారు. ఇక అసలు విషయాన్ని పరిశీలిస్తే .. ‘మహానాయకుడు’ క్లైమాక్స్ పై ఇప్పుడు చర్చ మొదలయ్యింది. ‘ఎన్టీఆర్ – కథానాయకుడు’ చిత్రం ఎక్కడైతే ప్రారంభమైందో …మహానాయకుడు చిత్రం అక్కడే ముగుస్తుందంటున్నారు ఫిలింనగర్ విశ్లేషకులు.
‘ఎన్టీఆర్ – కథానాయకుడు’ చిత్రంలో ఓపెనింగ్ షాట్.. బసవతారకం క్యాన్సర్ తో బాధపడుతూ… తన పెళ్ళి ఆల్బమ్స్ చూస్తూ ఎన్టీఆర్ జీవితాన్ని తన కొడుకు హరికృష్ణకి చెప్పడంతో మొదలుపెడుతుంది. అయితే ఇప్పుడు ‘ఎన్టీఆర్ – మహానాయకుడు’ చిత్ర క్లైమాక్స్ లో బసవతారకం ని క్యాన్సర్ మహమ్మారి కబళించడంతో.. మరణించడాన్ని చూపిస్తారని తెలుస్తుంది. అదే మహానాయకుడు క్లైమాక్సట. ఇక అదే సమయంలో ఎన్టీఆర్ రాజకీయాలతో సతమవుతూ.. భార్య ఆరోగ్యంపై కూడా ఆందోళలనతో ఉన్నప్పుడు.. నాదెండ్ల భాస్కర్ రావు…. భార్య ఆరోగ్యం సంగతి చూసుకొని.. నిశ్చింతగా వెళ్ళిరండి.. ఇక్కడ రాజకీయాలను నేను చూసుకుంటానంటూ చెప్పడం… ఆ తర్వాత ఎన్టీఆర్ రాజకీయ జీవితంలో నాదెండ్ల భాస్కర్ రావు ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడవడం జరుగుతుందట. ఇక ‘మహానాయకుడు’ సినిమా మొత్తం ఈ నాదెండ్ల ఎపిసోడే జరుగుతుందట.. ఎన్టీఆర్ రెండోసారి ముఖ్యమంత్రి అవడం వరకే సినిమా ఉంటుందని టాక్ వినిపిస్తుంది. మరి ఈ చిత్రం అసలు హిట్టవుతుందో… లేదో..చూడాలి..!