చంద్రబాబును హైలైట్ చేస్తున్న ఎన్టీఆర్ బయోపిక్స్
- February 16, 2019 / 07:56 PM ISTByFilmy Focus
వచ్చేవారం విడుదలకు సిద్ధమవుతున్న “ఎన్టీఆర్ మహానాయకుడు”, ఎప్పుడు విడుదలవుతుందో ఇంకా క్లారిటీ లేని “లక్ష్మీస్ ఎన్టీఆర్” ట్రైలర్స్ చూసిన తర్వాత ప్రతి ఒక్కరికీ వచ్చిన అనుమానం ఏమిటంటే.. ఇది నందమూరి తారకరామారావు జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్కా లేక చంద్రబాబునాయుడు బయోపిక్కా అని. రెండు సినిమా ట్రైలర్స్ లోనూ అన్నగారి జీవితం కంటే ఎక్కువగా చంద్రబాబు వ్యవహారశైలిని చూపించారు. అన్నిటికంటే ముఖ్యంగా.. చంద్రబాబు రాజకీయంగా ఎన్టీఆర్ ను ఎలా దెబ్బతీశాడు అనే విషయం మీదే ఈ రెండు చిత్రాలు రూపొందించబడడం విశేషం.
- దేవ్ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
- లవర్స్ డే రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
- ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ట్రైలర్ రివ్యూ..!
- ‘మజిలీ’ టీజర్ రివ్యూ
దాంతో.. “ఎన్టీఆర్ మహానాయకుడు, లక్ష్మీస్ ఎన్టీఆర్” సినిమాలు ఈ ఎలక్షన్స్ టైమ్ లో తెలుగుదేశం పార్టీకి నెగిటివ్ ఇంపాక్ట్ తీసుకురావడమే కాక చంద్రబాబునాయుడు ఇమేజ్ ను డ్యామేజ్ చేయడం ఖాయమని టాక్ వినిపిస్తోంది. మరి ఇదంతా ఎంతవరకూ ఎఫెక్ట్ అవుతుందో తెలియదు కానీ.. చంద్రబాబు నాయుడు మరియు ఆయన ఫాలోవర్స్ మాత్రం చాలా బాధపడుతున్నారు. మరి ఈ సినిమాల రిలీజ్ తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.














