Jr NTR: నాలుగో వారం తారక్ షో రేటింగ్ ఎంతంటే?

  • September 24, 2021 / 02:12 PM IST

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న ఎవరు మీలో కోటీశ్వరులు షో సోమవారం నుంచి గురువారం వరకు జెమినీ ఛానల్ లో రాత్రి 8.30 గంటలకు ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే. ఈ షో నాలుగో వారం రేటింగ్ 6.59 కావడం గమనార్హం. ఈ రేటింగ్ ఎవరు మీలో కోటీశ్వరులు షో మూడో వారం రేటింగ్ కంటే తక్కువ కావడంతో ఎన్టీఆర్ అభిమానులు ఫీలవుతున్నారు. క్రమంగా ఎన్టీఆర్ షోకు స్పందన పెరుగుతున్నా ఈ రేటింగ్ ఎన్టీఆర్ రేంజ్ కు తగిన రేటింగ్ కాదనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

అయితే బిగ్ బాస్ షో వీక్ డేస్ యావరేజ్ రేటింగ్ కంటే ఎవరు మీలో కోటీశ్వరులు రేటింగ్ ఎక్కువ కావడం గమనార్హం. బిగ్ బాస్ షో రెండో వారం వీక్ డేస్ యావరేజ్ రేటింగ్ 6.18గా ఉంది. అయితే బిగ్ బాస్ వీకెండ్ ఎపిసోడ్లకు మాత్రం ఏకంగా 9.96 రేటింగ్ వచ్చింది. తారక్ హోస్ట్ గా బాగానే చేస్తున్నా ఛానల్ కు రీచ్ ఎక్కువ లేకపోవడం వల్లే రేటింగ్ తక్కువగా వస్తోందనే కామెంట్లు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.

ఐదో వారంలో సోమవారం ప్రసారమైన ఎపిసోడ్ కు రాజమౌళి, కొరటాల శివ రావడంతో ఐదో వారం ఎవరు మీలో కోటీశ్వరులు షోకు మంచి రేటింగ్ వస్తుందని తారక్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. రాబోయే వారాల్లో మహేష్ ఈ షోకు హాజరైన ఎపిసోడ్ ప్రసారం కానుంది. ప్రభాస్ ను ఈ షోకు గెస్ట్ గా పిలవాలనే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని సమాచారం. ఎన్టీఆర్ స్టార్ సెలబ్రిటీలను ఎవరు మీలో కోటీశ్వరులు షోకు ఆహ్వానిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.

లవ్ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus