NTR: ఎన్టీఆర్- నీల్.. ఎందుకింత డిలే..!

Advertisement

ఎన్టీఆర్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ‘డ్రాగన్'(వర్కింగ్ టైటిల్). వీళ్లిద్దరి కలయిక అనగానే బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి హైప్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వాస్తవానికి ఈ మూవీ 2026 జూన్‌లోనే థియేటర్లలోకి రావాల్సింది.

NTR

మధ్యలో ఈ సినిమా ఆగిపోయిందంటూ ఎన్నో రూమర్లు వచ్చినా.. మేకర్స్ ఎప్పటికప్పుడు వాటికి చెక్ పెడుతూనే వచ్చారు. కానీ, సడెన్‌గా రిలీజ్ డేట్‌ను ప్రకటించి ఓ షాక్ ఇచ్చారు.2027 జూన్‌ లో ఈ సినిమా రిలీజ్ అవుతుందనే ప్రకటన రెండు రోజుల క్రితం వచ్చింది.

ఈ అప్డేట్ అందరినీ ఆశ్చర్యపరిచినా.. ఫ్యాన్స్ కి అయితే ఇది కొంత బర్దన్ అయ్యింది అనే చెప్పాలి. అసలు ఈ హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా ఏకంగా ఏడాది పాటు ఎందుకు వాయిదా పడింది? అనేది వారి ఆవేదన.ఇందుకు కారణాలు లేకపోలేదు.ఈ సినిమాలో ఎన్టీఆర్‌ను మునుపెన్నడూ చూడని సరికొత్త గెటప్‌లో చూపించాలని ప్రశాంత్ నీల్ ప్లాన్ చేశారు. దీనికోసం తారక్ బాగా బరువు తగ్గారు. అయితే ఆ లుక్ బయటకు వచ్చినప్పుడు పబ్లిక్ నుంచి కాస్త నెగిటివ్ రెస్పాన్స్ వచ్చింది.

దీంతో తారక్ మళ్లీ కండలు పెంచి, పర్ఫెక్ట్ మాస్ లుక్‌లోకి మారడానికి చాలా నెలలు టైమ్ పట్టింది. ఈ గ్యాప్ వల్లే షూటింగ్ బాగా డిలే అయ్యింది.షూటింగ్ జరుగుతున్న క్రమంలో ప్రశాంత్ నీల్ స్క్రిప్ట్‌లో కొన్ని మార్పులు చేయడం వల్ల అనుకున్న దానికంటే ఎక్కువ సమయం పట్టింది. దానికి తోడు.. తీసిన కొన్ని ఎపిసోడ్స్ ఔట్‌పుట్ తారక్‌కు అంతగా కన్విన్సింగ్‌గా అనిపించలేదట. దీంతో ఆ సీన్స్‌ను మళ్లీ రీ-షూట్ చేద్దామని ఆయన అడగడం, దానికి ప్రశాంత్ నీల్ కూడా ఓకే చెప్పడంతో షూటింగ్‌కు మరింత బ్రేక్ పడింది.

ఈ ప్రాజెక్ట్‌లో మెయిన్ విలన్‌గా ఫిక్స్ అయిన మలయాళ స్టార్ టొవినో థామస్ డేట్స్ ఇష్యూ వల్ల అర్ధాంతరంగా తప్పుకున్న సంగతి తెలిసిందే. దీంతో మళ్లీ కొత్త విలన్ కోసం కాస్టింగ్ ప్రాసెస్ మొదలుపెట్టాల్సి వచ్చింది. ఇది కూడా మూవీ డిలే అవ్వడానికి ఒక ప్రధాన కారణం.షూటింగ్‌లో ఇన్ని అడ్డంకులు వచ్చినా.. రీసెంట్‌గా జోర్డాన్‌లో తీసిన భారీ ఎపిసోడ్ ఔట్‌పుట్ అద్భుతంగా రావడంతో మేకర్స్‌లో ఫుల్ కాన్ఫిడెన్స్ పెరిగింది.

అందుకే ఏమాత్రం తొందరపడకూడదని నిర్ణయించుకున్నారు. ప్రశాంత్ నీల్‌కు కావాల్సినంత టైమ్ ఇచ్చి పర్ఫెక్ట్ ఔట్‌పుట్ తీసుకురావాలని నిర్మాతలు డిసైడ్ అయ్యారట.ఇలాంటి పరిణామాల వల్లే డ్రాగన్ రిలీజ్ ఏకంగా ఏడాది పాటు వాయిదా పడింది. ‘మైత్రీ మూవీ మేకర్స్’ ‘ఎన్టీఆర్ ఆర్ట్స్’ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఫైనల్‌గా 2027 జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు.

‘పెద్ది’ రిలీజ్‌ డేట్‌ చెప్పేసిన బుచ్చిబాబు.. ఈసారైనా మాట నిలబెట్టుకుంటారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus