ఎన్టీఆర్ తర్వాతి చిత్రంపై క్లారిటీ

  • October 28, 2016 / 09:43 AM IST

హ్యాట్రిక్ కొట్టినా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి దాహం తీరడం లేదు. టాలీవుడ్ నంబర్ వన్ కిరీటం దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ వంటి వరుస విజయాలతో జోష్ మీద ఉన్న తారక్ తన కెరీర్ గ్రాఫ్ ని మళ్లీ డౌన్ చేసుకోవడానికి ఇష్టపడడం లేదు. అందుకే ఓపికగా కథలు వింటున్నారు. తన దగ్గర వచ్చిన దర్శకులను పొమ్మనకుండా మంచి స్క్రిప్ట్ రాసుకురమ్మని ప్రోత్సహిస్తున్నారు. ఇలా ఎన్టీఆర్ కోసం కథలను సిద్ధం చేస్తున్న దర్శకుల జాబితా చాలా పెద్దదిగానే ఉంది.

అయితే తారక్ మాత్రం తనకి ఆది, అదుర్స్ వంటి సూపర్ హిట్స్ ఇచ్చిన మాస్ డైరక్టర్ వి.వి.వినాయక్ కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా ఖైదీ నంబర్ 150ని తెరకెక్కించే పనిలో ఉన్న డైరక్టర్.. జనవరి నాటికి బయటికి రానున్నారు. జనవరి 13 న ఈ చిత్రం రిలీజ్ అయిన వెంటనే ఎన్టీఆర్ తో సినిమాను మొదలు పెట్టనున్నట్లు తాజా సమాచారం. కథ, స్క్రిప్ట్ మొత్తం ఇది వరకే ఒకే అయిపోయిందని, సంక్రాంతి తర్వాత సెట్స్ మీదకు వెళ్ళిపోతుందని టాక్. ఇంతకీ కథ ఏమిటి అనుకుంటున్నారా? ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ తో హాస్యాన్ని, యాక్షన్ ని అద్భుతంగా పండించిన అదుర్స్ సినిమాకి సీక్వెల్ అట. అయితే నందమూరి అభిమానులు మరో సారి డబుల్ ధమాకాను ఎంజాయ్ చేయనున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus