బాలీవుడ్ మిస్టర్ ఫర్ఫెక్ట్ అమీర్ ఖాన్ కి దేశంలో అనేక మంది అభిమానులున్నారు. స్టార్ హోదా ఉన్నప్పటికీ కథనే నమ్ముకుని, కథనే హీరో చేసి వరుసగా విజయాలను అందుకుంటున్నారు. ఇదే బాటలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నడుస్తున్నారు. మొన్నటి వరకు ఫుల్ యాక్షన్ సినిమాలను చేసిన తారక్ ఇప్పుడిప్పుడే మెసేజ్ ఓరియంటెడ్ చిత్రాలను చేస్తున్నారు. అభిమానులు ఆదరిస్తుండడంతో అటువంటి కథలకు సై అంటున్నారు. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో చేస్తున్న సినిమా కథ కూడా చాలా విభిన్నంగా ఉంటుందని సమాచారం. భారీ బడ్జెట్ తో కల్యాణ్‌రామ్ నిర్మిస్తున్న మూవీలో ఎన్టీఆర్ మూడు పాత్రలో మెప్పించనున్నారు. ఆ మూడు పాత్రలను అద్భుతంగా చూపించడానికి బాలీవుడ్ కెమెరా మెన్ సీ కే మురళీధరన్ ని తీసుకున్నారు.
ఇతను అమీర్ ఖాన్ గత చిత్రాలు ‘3ఇడియట్స్’, ‘పీకే’ లకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు. ఎన్టీఆర్ 27 మూవీ ద్వారా ఛాయాగ్రాహకుడిగా టాలీవుడ్ లో అడుగు పెడుతున్నారు. మురళీధరన్ ఈ చిత్రానికి ఒప్పుకున్నారంటే కేవలం డబ్బు కోసమే కాదని, కథలో చాలా డెప్త్ ఉంది కాబట్టే ఒప్పుకున్నారని చిత్ర బృందం చెప్పింది. ఈ సినిమాతో ఎన్టీఆర్ కి అమీర్ ఖాన్ క్రేజ్ వస్తుందని ధీమా వ్యక్తం చేసింది. ఈనెల 26 నుంచి సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ మూవీలో ముగ్గురు బ్యూటీలు కాజల్ అగర్వాల్, మంజిమ మోహన్, అనుపమ పరమేశ్వరన్ నటించనున్నట్లు తెలిసింది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.