బాలయ్య 100వ చిత్రంలో ఎన్టీఆర్….

నందమూరి బాలకృష్ణ 99సినిమాలు దిగ్విజయంగా పూర్తి చేశాడు. కానీ వందో సినిమా విషయంలో మాత్రం డైలమాలో పడ్డాడు అని అందరూ అనుకుంటున్నారు. ఇదిలా ఉంటే లేపాక్షి ఉత్సవాలను అత్యంత ఘనంగా జరిపిన నేపధ్యంలో ఫుల్ జోష్ పై ఉన్న బాలకృష్ణను మీడియా సోదరులు పలకరించారు. లేపాక్షి ఉత్సవాల వేడుకల గురించి అభినందిస్తూనే మరో పక్క బాలయ్య 100వ సినిమాపై మాట కలిపారు. ఇక దీనిపై స్పందించిన బాలయ్య…తన వందో సినిమాలో భారీ ట్విస్ట్స్ ఉన్నాయని చెప్పడంటా. ఇంతకీ ఆ ట్విస్ట్ ఏంటంటే..ఈ100వ సినిమాలో నందమూరి తారక రత్న ఒక నెగిటివ్ షేడ్ ఉండే పాత్రలో నటించబోతూ ఉంటే నారా రోహిత్ సైతం ఒక ప్రత్యేక పాత్రలో కనిపిస్తాడు అని మీడియాకు కు తెలిపాడు బాలయ్య.

అంతేకాకుండా ఈ సినిమాకు దర్శకుడిగా దాదాపుగా కృష్ణ వంశీ ఖరారు అయినట్లే తెలుస్తుంది. తన నిర్ణయాన్ని బాలయ్య ప్రకటించడమే తరువాయి. ఇక అంతా కన్ఫర్మ్ అయితే ఈ సినిమా నందమూరి తారకరామారావు పుట్టినరోజునాడు మే 28వ తారీఖున ఈ సినిమా అధికారికంగా ప్రారంభం అవుతుంది అని అంటున్నారు. ఇక ఈ సినిమాని ఎట్టి పరిస్తితుల్లో అభిమానులకు నచ్చే విధంగా తీయాలి అన్న ఆలోచనతో బాలయ్యకు అత్యంత సన్నిహితులైన పరుచూరి బ్రదర్స్ ను సంప్రదిస్తున్నట్లు సమాచారం. ఇక ‘రైతు’ ఆధారంగా తెరకెక్కుతున్న కధ అని టాలీవుడ్ నుంచి వినిపిస్తున్న వాదన. చూద్దాం మరి బాలయ్య 100వ సినిమా ఎంత కొత్తగా ఉంటుందో.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus