‘స్పైడర్’ అనంతరం మరో తెలుగు సినిమా లేక, రాక బాలీవుడ్ లో అజయ్ దేవగన్ సరసన ఒక చిత్రం, తమిళంలో కార్తీ సరసన ఒక సినిమా, సూర్యతో ఇంకో సినిమాలో నటిస్తూ తెలుగులో ఆఫర్ కోసం వేయి కళ్ళతో వెయిట్ చేస్తోంది. అయితే.. రకుల్ లాంగ్ వెయిటింగ్ కి సమాధానం దొరికినట్లుంది. అమ్మడు ఏకంగా ఎన్టీయార్-రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి తెరకెక్కించనున్న భారీ మల్టీస్టారర్ లో నటించే అవకాశం సొంతం చేసుకొన్నట్లు తెలుస్తోంది.
ఆల్రెడీ రామ్ చరణ్ సరసన “బ్రూస్ లీ, ధృవ” చిత్రాల్లో నటించి ఉన్న రకుల్ ప్రీత్, ఎన్టీయార్ తోనూ “నాన్నకు ప్రేమతో” సినిమాలో నటించింది. ఇప్పుడు రాజమౌళి సినిమాలో రకుల్ అన్న పాత్ర పోషించనున్న ఎన్టీయార్ కు జోడీగా నటించనుందని తెలుస్తోంది. ఈ సినిమా గనుక కన్ఫర్మ్ అయితే.. హీరోయిన్ గా రకుల్ తీసుకున్న గ్యాప్ కి న్యాయం జరగడంతోపాటు ఆమె స్టార్ డమ్ డబుల్ అవుతుంది.
ఇకపోతే.. రకుల్ ప్రస్తుతం సెకండ్ హీరోయిన్ గా సూర్య సినిమాలో నటిస్తుండగా ఆ సినిమా షూటింగ్ చెన్నైలో జరుగుతోంది. సెల్వరాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో సాయిపల్లవి మెయిన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. రకుల్ ది చాలా కీలకపాత్ర అని తెలుస్తోంది.