ఇండియన్ వైడ్ చరిత్ర సృష్టించిన ఎన్టీఆర్, విజయ్ ..!

‘ఆర్.ఆర్.ఆర్’ నుండీ ఎన్టీఆర్ పాత్రకు సంబంధించిన కొమరం భీమ్ టీజర్ ను అక్టోబర్ 22 న విడుదల చేసిన సంగతి తెలిసిందే. 1 మిలియన్ లైక్స్ ను సాధించిన మొట్ట మొదటి టాలీవుడ్ టీజర్ గా .. ‘రామరాజు ఫర్ భీమ్’ చరిత్ర సృష్టించాడనే చెప్పాలి. సౌత్ సినిమాల పరంగా చూసుకుంటే.. ఆ ఫీట్ ను సాధించిన మూడో టీజర్ గా ‘రాజరాజు ఫర్ భీమ్’ నిలిచాడు.దీనికంటే ముందే కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ 2 సినిమాలతో ముందున్నాడు.

2017 లో విడుదలైన ‘మెర్సల్’ చిత్రం టీజర్.. మొదటి 1 మిలియన్ లైక్స్ ను సాధించిన టీజర్ గా రికార్డ్ సృష్టించింది. ఆ తరువాత ‘సర్కార్’ టీజర్ తో మళ్ళీ తన రికార్డుని తనే బద్దలుకొట్టుకున్నాడు విజయ్. అతనికి గల ఫ్యాన్ ఫాలోయింగ్ అలాంటిది మరి. ఇక విజయ్ తరువాత ఎన్టీఆర్ కూడా ఈ లిస్టులో చేరడం విశేషం. వీరిద్దరూ నిజ జీవితంలో మంచి స్నేహితులన్న సంగతి తెలిసిందే.

సోషల్ మీడియాలో వీళ్ళకు సంబంధించిన అప్డేట్సే రికార్డులు మీద రికార్డులు సృష్టిస్తుంటాయి. ఇక టీజర్లతో యూట్యూబ్ ను కూడా షేక్ చేసేసారు.ఇవి ఇండియన్ వైడ్ కూడా పెద్ద రికార్డ్ అనే చెప్పాలి. ఇక విజయ్ నటించిన ‘మాష్టర్’ చిత్రం విడుదలకు సిద్దంగా ఉండగా.. ఎన్టీఆర్ ‘ఆర్.ఆర్.ఆర్’ ను ఫినిష్ చెయ్యాల్సి ఉంది.

Most Recommended Video

కలర్ ఫోటో సినిమా రివ్యూ & రేటింగ్!
24 గంటల్లో అత్యధిక లైక్స్ ను సాధించిన టాప్ 20 టీజర్లు ఇవే..!
టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus