Lakshmi Pranathi: నైట్ బజార్లో షాపింగ్ చేస్తున్న ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి.. ఫోటో వైరల్.!

  • April 17, 2023 / 07:37 PM IST

రంజాన్ మాసంలో చార్మినార్ వద్ద నైట్ బజార్ వద్ద సందడి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందుకే బట్టల షాపింగ్, గాజుల షాపింగ్ చేయడానికి చాలా మంది తరలివస్తారు.అంతేకాదు అక్కడ రకరకాల ఫుడ్ ఐటమ్స్ కూడా ఉంటాయి. అన్ని చాలా టేస్టీగా ఉంటాయి. హలీం కోసం వచ్చే జనాల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. ముస్లిం సోదరులు మాత్రమే కాదు హైదరాబాద్ నలుమూలల నుండి ఈ నైట్ బజార్ కు అధిక సంఖ్యలో జనాభా వస్తుంటారు.

ఇదిలా ఉండగా.. తాజాగా ఎన్టీఆర్ సతీమణి లక్ష్మి ప్రణతి కూడా చార్మినార్ నైట్ బజార్ కు వచ్చి సందడి చేయడం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అంశం. అక్కడ ఈమె షాపింగ్ చేస్తూ అభిమానుల కెమెరాలకి చిక్కింది. దీంతో ‘నైట్ బజార్లో షాపింగ్ చేస్తున్న వదినమ్మ లక్ష్మి ప్రణతి’ అంటూ ఎన్టీఆర్ అభిమానులు ఈ ఫోటోని వైరల్ చేస్తున్నారు.

అయితే ‘నిజంగానే లక్ష్మి ప్రణతి (Lakshmi Pranathi) చార్మినార్ లో నైట్ బజార్ లో కనిపించిందా? లేక ఆమెలా ఉన్న మరో ఆమేనా?’ అనే అనుమానాలు కూడా కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. ఇక డిసెంబర్ లో పిల్లలతో సహా నెలరోజుల పాటు భర్త ఎన్టీఆర్ తో అమెరికాలో సందడి చేసి వచ్చింది ప్రణతి. మిగతా స్టార్ హీరోల భార్యల్లా ఈమె సోషల్ మీడియా ప్రొఫైల్స్ మెయింటైన్ చేయదు. అందుకే ఈమె ఎక్కడ కనిపించినా అభిమానులు ఫోటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేసి ట్రెండ్ చేస్తుంటారు.

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus