బాలకృష్ణ కు ఆల్ ది బెస్ట్ చెప్పిన ఎన్టీఆర్!

  • January 12, 2017 / 08:46 AM IST

తెలుగువారి కీర్తిని నలుదిక్కులా విస్తరింపజేసిన శాతకర్ణిగా… నటసింహ నందమూరి బాలకృష్ణ నటించిన ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయి ప్రశంసలు అందుకుంటోంది. బాలయ్య వందో చిత్రం ఘనవిజయం సాధించాలని సినీ ప్రముఖులు ఉదయం నుంచి శుభాకాంక్షలు చెబుతున్నారు. వీరిలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఉన్నారు. గతంలో ఈ మూవీ ట్రైలర్ చూసి బాబాయ్ నటనను, క్రిష్ ట్యాలెంట్ ని అభినందించిన తారక్, విడుదలను పురస్కరించుకొని తాజాగా శాతకర్ణి టీమ్ మొత్తానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు.

గౌతమి పుత్ర శాతకర్ణి బాబాయ్ కెరీర్ లో గొప్ప చిత్రంగా నిలవాలని ఆకాంక్షించారు. ఆయన ఈ రోజు సాయంత్రం కుటుంబ సమేతంగా చిత్రాన్ని వీక్షించనున్నట్లు సమాచారం. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన ఈ సినిమాలో శ్రియ హీరోయిన్‌గా నటించగా, బాలీవుడ్ డ్రీమ్ గర్ల్ హేమమాలిని గౌతమి పాత్రకు ప్రాణం పోసింది. చిరంతన్ బట్ సంగీతం సన్నివేశాలకు బలాన్నిచ్చాయి. పోరాట సన్నివేశాలకు వీఎఫ్ఎక్స్ హంగులు తోడయ్యేసరికి ప్రేక్షకులకు ఈ మూవీ మంచి అనుభూతిని అందిస్తోంది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus