మోడల్ గా కెరీర్ ను ప్రారంభించి నువ్వునేను సినిమాతో అనిత నటిగా తనకంటూ మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు. తెలుగులో హీరోయిన్ గా నటించిన తొలి సినిమానే సక్సెస్ కావడంతో ఆమెకు ఆఫర్లు బాగానే వచ్చాయి. అయితే నువ్వు నేను మినహా తెలుగులో నటించిన సినిమాలు సక్సెస్ కాకపోవడంతో అనితకు కొన్నేళ్ల తరువాత ఆఫర్లు తగ్గాయి. తెలుగుతో పాటు హిందీ, కన్నడ సినిమాల్లో కూడా నటించిన అనిత నాగిని సిరీస్ సీరియళ్లలో నటించి బుల్లితెర ప్రేక్షకులకు చేరువయ్యారు.
అయితే వెండితెర, బుల్లితెర ప్రేక్షకులకు షాకిచ్చేలా తాజాగా అనిత సంచలన నిర్ణయం తీసుకున్నారు. నటనకు గుడ్ బై చెబుతున్నానని అనిత కీలక ప్రకటన చేశారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇకపై వెండితెరకు, బుల్లితెరకు దూరంగా ఉండబోతున్నానని అనిత వెల్లడించారు. అనిత చేసిన ప్రకటనతో ఆమె అభిమానులు అవాక్కవుతున్నారు. ఇకపై తాను కెమెరా ముందుకు వచ్చే ప్రసక్తే లేదని అనిత స్పష్టం చేయడం గమనార్హం. బుల్లితెరపై సీరియల్ ఆఫర్లతో బిజీగా ఉన్న సమయంలోనే అనిత నటనకు గుడ్ బై చెప్పడం గమనార్హం.
2013 సంవత్సరంలో రోహిత్ రెడ్డిని వివాహం చేసుకున్న అనిత కొన్ని నెలల క్రితం ఒక చిన్నారికి జన్మనిచ్చారు. చిన్నారి బాగోగులను చూసుకోవాలనే ఉద్దేశంతో అనిత నటనకు దూరం కావాలని నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. అనిత తీసుకున్న నిర్ణయంపై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కరోనా వైరస్ లేకపోయినా నటన విషయంలో తన నిర్ణయం ఇదేనని అనిత చెప్పుకొచ్చారు.
Most Recommended Video
ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!