ఉద్యోగం రావడానికి ఎన్నో పరీక్షలు.. ఎన్నో ప్రశ్నలు ఎదుర్కొంటాము. జాబ్ వచ్చిన తర్వాత కూడా టెన్షన్ పోదు. ఎందుకంటే ఆఫీస్ ఎలా ఉంటుందో? అక్కడి కొలీగ్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో? అనే అనేక ప్రశ్నలు బుర్రలో చక్కర్లు కొడుతుంటాయి. ఇక అమ్మాయికైతే ఈ ఇబ్బంది కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఏ డ్రస్సులు వేసుకోవాలి.. ఎవరిని ఎలా పిలవాలి అనే కొత్త కొత్త డౌట్స్ వస్తుంటాయి. ఇలాంటి అనుభవాలను అన్నింటిని సేకరించి “ఆఫీస్ లో కొత్త అమ్మాయి” అనే క్యూట్ వీడియోని మహాతల్లి మనకి అందించింది.
ఈ వారం విడుదలైన ఈ వీడియో మొదటి నుంచి చివరి వరకు నవ్వులను పంచుతోంది. ఈ వీడియో చూస్తే మీకు కూడా జాబ్ లో చేరిన మొదటి రోజు తప్పకుండా గుర్తుకు వస్తుంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.