పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా ఓజీ (OG Movie) ఇప్పుడు మాస్ సినిమాల లిస్టులో టాప్ స్పాట్ దక్కించుకుంది. ఈ సినిమాకు సంబంధించి వచ్చిన టీజర్, లుక్స్ సోషల్ మీడియాలో రికార్డు స్థాయిలో రియాక్షన్లను సంపాదించాయి. ఇప్పుడు సినిమాకు మరింత ఊపిచ్చేలా ఓ సీన్ గురించి బజ్ స్టార్ట్ అయింది. ఇది రెండు గ్యాంగ్ గ్రూపుల మధ్య రక్తపాత సంఘర్షణ నేపథ్యంలో రూపొందిన భారీ యాక్షన్ సీన్.
ఈ సీన్‌లో పవన్ ఎంట్రీ ఓ మేజర్ హైలైట్ అంటున్నారు. థియేటర్‌లో ఆ ఒక్క సీన్ సమయంలో అలజడి సృష్టించడమే కాకుండా.. పవన్ అభిమానులకు ఇది ఒక డ్రీమ్ మూమెంట్ లాగా అనిపిస్తుందని ఇంటర్నల్ సర్కిల్స్ చెబుతున్నాయి. పవన్ స్టైల్, స్క్రీన్ ప్రెజెన్స్, స్లో మోషన్ ఎంట్రీ, డైలాగ్ డెలివరీ.. ఇలా అన్ని కలిపి సినిమాను మరో లెవెల్ కు తీసుకు వెళతాయట.
ఇదే సీన్ సినిమాకి ప్రధాన మార్క్ గా నిలవనుందట. డైరెక్టర్ సుజీత్ ఈ ఎపిసోడ్‌కి ఓ డార్క్ ఫిల్మీ టోన్ అందించేలా ప్లాన్ చేశారని సమాచారం. థమన్ (S.S.Thaman) అందించిన BGM ఈ సీన్‌కి ప్రాణం ఇవ్వనుందట. పవన్ ఓ వాక్‌తో వచ్చి, ఒక్క డైలాగ్‌తో స్క్రీన్‌ను బిగ్ బ్లాస్ట్‌లా మార్చేలా ఈ సీన్‌ను తెరకెక్కించారని ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు. ఇప్పుడు ఈ మాస్ సీన్ చుట్టూ నెట్టింట్లో ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి.
“OG ఎంట్రీ సీన్ తర్వాత థియేటర్ ఎలా ఉంటుంది?” అనే క్యాప్షన్లతో ఫ్యాన్ ఎడిట్ వీడియోలు ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఫ్యాన్స్ అంచనాల కంటే రెట్టింపు విజువల్ ఫీస్ట్‌గా ఈ సీన్ ఉండనుందన్నదే టాక్. OG విడుదలైన తర్వాత ఈ సీన్ సోషల్ మీడియా హైలైట్ అవడం ఖాయం. మొత్తానికి, ఓజీ ఫేస్ ఆఫ్ సీన్ సినిమాకు బ్రాండ్ వాల్యూ తీసుకురావడమే కాదు, పవన్ ఫ్యాన్ బేస్‌ను థియేటర్లలో మళ్ళీ రెచ్చగొట్టేలా ఉండబోతోందని అర్థమవుతోంది.