.ధనుష్ – నాగార్జున – శేఖర్ కమ్ముల కాంబినేషన్లో ‘కుబేర’ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. శేఖర్ కమ్ముల మరోసారి తన పంధా మార్చి చేసిన సినిమా ఇది. జూన్ 20 న విడుదల కానుంది. సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మించారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో కొద్దిసేపటి క్రితం ‘ట్రాన్స్ ఆఫ్ కుబేర’ పేరుతో ఓ టీజర్ ని వదిలారు.
‘కుబేర’ టీజర్ 2 నిమిషాల 7 సెకన్ల నిడివి కలిగి ఉంది. ‘నాది నాది నాది నాది నాదే ఈ లోకమంతా’ అంటూ ఈ టీజర్ మొదలైంది. ఈ సినిమాలో అత్యంత కీలకమైన 4 కీలక పాత్రలను దీంతో పరిచయం చేశారు. చాలా ఫిలాసఫికల్ గా టీజర్ సాగింది. ఇందులో ఎక్కడా కూడా నటీనటుల వాయిస్..లు వినిపించలేదు.
మొత్తం పాట రూపంలోనే సినిమా థీమ్ ని వివరించే ప్రయత్నం చేశారు.నాగార్జున, ధనుష్, జిమ్ సరభ్, రష్మిక మందన వంటి వారి పాత్రలను ఈ టీజర్ ద్వారా పరిచయం చేశారు.ఓ ఉద్యోగి అయిన వ్యక్తి(నాగార్జున) జీవితంలో వచ్చిన సమస్యలు ఏంటి? బిచ్చగాడి(ధనుష్) వెంట అతను ఎందుకు వెళ్తున్నాడు? వీరికి విలన్(జిమ్ సరభ్) , మరో వ్యక్తి(రష్మిక)..ల మధ్య ఉన్న సమస్య ఏంటి? అనే సస్పెన్స్ ని మెయింటైన్ చేస్తూ టీజర్ ను కట్ చేశారు.
ఒక రకంగా ఇది టీజర్ గా కాకుండా థీమ్ సాంగ్ ఫీలింగ్ ను కలిగిస్తుంది. సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ కి ఎక్కువ పని పడింది. కాకపోతే ఆ బ్యాక్ గ్రౌండ్ సాంగ్ కొంచెం తమిళ వాసన కొట్టింది. మీరు కూడా ఈ టీజర్ ను ఒక లుక్కేయండి :